బాబు కార్యాలయం ఫిర్యాదుల పెట్టెగా మారింది

Update: 2015-10-07 11:17 GMT
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని గా ఉన్న విజయవాడలోన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయానికి బుధవారం ఓ మహిళ విషం సీసాతో వచ్చి కలకలం రేపింది. వెంటనే భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని ప్రమాదాన్ని నివారించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఆమె తన ఇంటిని తెలుగుదేశం నేతలు కొందరు ఆక్రమించుకోవాలని చూస్తున్నారనంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చింది. విషం సీసాతో రావడంతో విషయం చంద్రబాబు వరకు వెళ్లి ఆమెను పిలిపించారు. దాంతో ఆమె అక్కడి టీడీపీ నేతలు చేస్తున్న ఆగడాలపై సీఎంకు కంప్లయింటు చేశారు. స్పందించిన సీఎం సమస్య పరిష్కరించి ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

మరోవైపు రాజధాని ప్రాంత టీడీపీ నేతలపై ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. మంత్రి రావెల కిశోర్ బాబుపైన పలువురు లోకేష్‌కు కంప్లయింటు చేశారట. పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు లోకేశ్ ను కలిసి మంత్రి కార్యకర్తలను పట్టించుకోవడం లేదని... ఆయన హాయ్ ల్యాండ్సులోనే మకాం వేస్తున్నారు కానీ నియోజకవర్గం మొఖం చూడడం లేదని ఫిర్యాదు చేశారు.  టీడీపీ వాళ్లను పక్కనపెట్టి కాంగ్రెస్ కార్యకర్తలకు పనులు చేస్తున్నారని వారు ఆరోపించారు.

మొత్తానికి విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయం టీడీపీ నేతలపై ఫిర్యాదులతో దద్దరిల్లుతోంది. ఏపీ జిల్లాలకు విజయవాడ అందుబాటులో ఉండడంతో తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి వస్తూ సీఎంకు కానీ, లోకేశ్ కు కానీ ఫిర్యాదులు చేస్తున్నారు.
Tags:    

Similar News