• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రానున్న వారం.. పదిహేను...

రానున్న వారం.. పదిహేను రోజులు లాక్ డౌన్ అవసరమా?

By - Tupaki Desk
Update: 2020-03-21 15:30 GMT
అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటే.. అనవసరమైన ఇబ్బందుల నుంచి బయటపడతామన్న మాటను చాలామంది నోట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడిదే మాట.. దేశానికి శ్రీ రామరక్ష గా మారుతుందా? అన్నది ప్రశ్నగా మారింది. మిగిలిన దేశాలతో పోలిస్తే.. భారత్ లో కరోనా ప్రభావం ఆలస్యంగానే మొదైలంది. కాకుంటే.. ఈ వారంలో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదు కావటమే కాదు.. రానున్న రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందన్న విషయాన్ని బయటకు వస్తున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి.

కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఏ మాత్రం తప్పు దొర్లినా.. ఇటలీ.. ఫ్రాన్స్.. ఇరాన్.. మాదిరి పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. కేంద్రంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నా.. కొందరు చేసే తప్పులు.. అందరికి శాపాలుగా మారనున్నాయి. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన పలువురు.. వారికి నిర్దేశించినట్లు కాకుండా.. తమకు తోచినట్లుగా వ్యవహరిస్తూ.. కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా కఠిన చర్యలకు తెర తీయాల్సిందేనన్న సూచన పలువురి నుంచి వస్తోంది. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్త ఒకరు ఆందోళన వ్యక్తం చేస్తూ.. కరోనా వ్యాప్తికి దేశ వ్యాప్తంగా తీసుకున్న చర్యలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవన్న మాటను అనధికారికంగా వెల్లడించటం గమనార్హం. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు.. దేశంలోకి దిగిన వెంటనే స్వీయ క్వారంటైన్ విషయంలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

వేలాది మంది విదేశాల నుంచి దేశానికి చేరుకున్న నేపథ్యంలో.. ఐసోలేషన్ కు తరలించకుండా.. సెల్ఫ్ డిక్లరేషన్ తో వారిని వదిలేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త కష్టమైనా.. రానున్న వారం.. పదిహేను రోజుల పాటు పూర్తిగా షట్ డౌన్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. అలా చేయటం ద్వారా ప్రజలకు కొంత కష్టం కలిగినా.. ఎవరింట్లో వారిని  పరిమితం చేయటం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రానున్న వారం.. పదిహేను రోజుల్లో దేశంలో ఏం జరుగుతుందన్న భయాందోళనలు ఎక్కువగా ఉంది. పలువురు శాస్త్రవేత్తలు సైతం.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేస్తే.. వైరస్ సోకే వేగానికి బ్రేకులు వేసేందుకు సాయం చేస్తుందని చెబుతున్నారు. మరీ.. విషయంలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాల్ని తీసుకుంటాయో చూడాలి.
Tags:    
  • janatacurfew 
  • March 22nd Bundh 
  • Latest Corona News 
  • Latest Political News 
  • Latest Telangana News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS