వైరల్ పిక్: కామెడీ బ్రహ్మతో రాజకీయ బ్రహ్మ

Update: 2020-01-27 06:03 GMT
ఇద్దరూ పూర్తి వ్యతిరేకమైన భావజాలం గల వ్యక్తులు. ఒకరేమో టాలీవుడ్ కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం. మరొకరేమో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బ్రహ్మానందం తన కామెడీ తో తెలుగువారి అభిమానాన్ని చూరగొన్న నటుడు. తన ఉద్యమ చరిత్రతో తెలంగాణ ప్రజానీకం మనసుదోచి తెలుగు ప్రజల దృష్టిలో రాజకీయ బ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్నారు కేసీఆర్. ఈ ఇద్దరు కలిసిన అరుదైన సందర్భం ఒకటి చోటుచేసుకుంది. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం తో 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి రాజ్ భవన్ లో కలుసుకున్నారు. చేతిలో చేయ్యేసి ఆప్యాయం గా పలకరించుకున్నారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఎట్ హోట్’ కార్యక్రమంలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం తో కేసీఆర్ ఫుల్ జోష్ లో ఈ కార్యక్రమంలో కనిపించారు. మరోవైపు గుండెకు ఆపరేషన్ చేయించుకొని కోలుకుంటున్న బ్రహ్మానందం సినిమాలకు దూరంగా ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నారు. వీరిద్దరి కలయిక, ఏం మాట్లాడుకున్నారన్నది ఆసక్తి గా మారింది. కామెడీ బ్రహ్మ, రాజకీయ బ్రహ్మ కలిశారంటూ సోషల్ మీడియా లో ఈ పిక్ వైరల్ గా మారింది.
Tags:    

Similar News