క‌లెక్ట‌ర్ ఓవ‌రాక్ష‌న్‌!.. యువ‌కుడిపై దాడి!

Update: 2021-05-23 10:36 GMT
క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ అధికారులు.. ప‌లు చోట్ల హ‌ద్దు మీరుతున్నారు. ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మొన్నామ‌ధ్య త్రిపుర‌లో పెళ్లివేడుక‌లో దూరి నానా ర‌భ‌స చేశాడు ఓ క‌లెక్ట‌ర్‌. తాజాగా.. ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రంలోనూ ఓ క‌లెక్ట‌ర్ ఇదే విధంగా ప్ర‌వ‌ర్తించాడు.

స‌రైన కార‌ణం లేకుండా రోడ్డుపైకి వ‌చ్చాడంటూ సుర‌జ్ పూర్ క‌లెక్ట‌ర్ ర‌ణ్ బీర్ శ‌ర్మ ఓ యువ‌కుడిని చెంప‌పై కొట్టారు. అంతేకాకుండా.. అత‌ని చేతిలోని ఫోన్ తీసుకొని నేల‌కేసి కొట్టారు. ఆ త‌ర్వాత పోలీసులు కూడా లాటీల‌తో యువ‌కున్ని కొట్టారు. ఈ వ్య‌వ‌హారాన్ని షూట్ చేసిన మిగిలిన పౌరులు.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.

దీంతో.. ఈ వీడియో వైర‌ల్ అయ్యింది. ప‌రిస్థితి చేయి దాటిపోతోంద‌ని భావించిన క‌లెక్ట‌ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అత‌ను వ్యాక్సినేష‌న్ కోసం బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని మొద‌ట చెప్పాడ‌ని, ఆ త‌ర్వాత త‌న తాత‌య్య ద‌గ్గ‌ర‌కు వెళ్తున్నాన‌ని అబ‌ద్దాలు చెప్ప‌డంతో.. క్ష‌ణికావేశంలో కొట్టిన‌ట్టు చెప్పారు. ఇందుకు గానూ క్ష‌మాప‌ణ కోరుతున్నాన‌ని అన్నారు.

అయితే.. ఈ విష‌యం ముఖ్య‌మంత్రి వ‌ర‌కూ వెళ్ల‌డంతో ఛ‌త్తీస్ గ‌ఢ్ సీఎం భూపేష్ బ‌ఘేల్ తీవ్రంగా స్పందించారు. వెంట‌నే అత‌డిని తొల‌గిస్తూ ఆదేశాలు జారీచేశారు. మొత్తానికి సారీ చెప్పిన‌ప్ప‌టికీ.. క‌లెక్ట‌ర్ సాబ్ కు శిక్ష త‌ప్ప‌లేదు.

ఇదిలాఉంటే.. అదే ఛ‌త్తీస్ గ‌ఢ్ లో, అదే జిల్లాలో.. మ‌రో ఆఫీస‌ర్ సైతం యువ‌కుడిపై దాడిచేయ‌డం గ‌మ‌నార్హం. సూర‌జ్ పుర్ జిల్లా ప‌రిధిలోని ఎస్‌డీఎం ప్ర‌కాష్ సింగ్ ఓ యువ‌కుడిని చెంప‌దెబ్బ కొట్టారు. ఈ వీడియో కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నిబంధ‌న‌ల పేరుతో అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. ఫోన్లు నేల‌కేసి కొట్ట‌డం.. చెంప దెబ్బ‌లు కొట్ట‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు.


Full ViewFull View
Tags:    

Similar News