లాక్డౌన్ లో బట్టబయలు: ఇంట్లో ఇల్లాలు.. ఆఫీసులో ప్రియురాలు
లాక్ డౌన్ తో కాపురాల్లో చిచ్చుమొదలవుతోంది. చాటు మాట వ్యవహారాలన్నీ వెలుగుచూస్తున్నాయి. కరోనా వైరస్ తో దేశమంతా లాక్ డౌన్. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో లవ్ఎఫైర్స్ పెట్టుకున్నవారు.. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. వారి బండారాలు బయటపడుతున్నాయి.
అతడు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగి. పెళ్లైంది.. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి తన సహోద్యోగితో ప్రేమాయణం సాగించాడు. ఇంట్లో ఇల్లాలిని పెట్టి.. ఆఫీసులో ప్రియురాలితో ఇద్దరినీ జాగ్రత్తగా మెయింటేన్ చేస్తూ సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ప్రియురాలితో సినిమాలు షికార్లు, లాంగ్ డ్రైవ్ లు వెళ్లి సరదాలు తీర్చుకున్నాడు. కానీ లాక్ డౌన్ అతడి కొంప ముంచింది.
లాక్ డౌన్ టైంలో ప్రియుడు ఇంట్లో భార్యతో ఉంటున్నాడు. ఐటీ కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో అందరూ ఇంటిపట్టునే ఉండి పనిచేసుకుంటున్నారు. దీంతో ప్రియురాలితో మాటలు కట్ చేశాడు. ప్రియుడి నుంచి ఫోన్ రాకపోవడం.. సమాచారం లేకపోవడం.. ఫోన్ లో బ్లాక్ చేయడంతో అతడిని వెతుక్కుంటూ వెళ్లిన ప్రియురాలికి షాక్ తగిలింది. ఇంట్లోకి వెళ్లగానే భార్య ఒడిలో తలపెట్టుకొని పడుకున్న ప్రియుడిని చూసి ఆ యువతి మోసపోయానని గ్రహించి లబోదిబోమంది..
వెంటనే తేరుకున్న ప్రియురాలు తనను మోసం చేసిన ప్రియుడి దుమ్ముదులిపింది. ఇక అతడి భార్య కూడా ప్రియురాలితో ఎఫైర్ తెలిసి భగ్గుమంది ఇద్దరూ కలిసి దాడి చేయడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించి ప్రియుడు రోడ్డుమీదకు వచ్చాడు. పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి ఈ ప్రియుడిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చి గడ్డిపెట్టి పంపించారు.
ఇలా ఇన్నాళ్లు ఇంట్లో బుద్దిమంతులుగా కలరింగ్ ఇచ్చిన వాళ్ల చీకటి వ్యవహారాలన్నీ కరోనా దెబ్బకు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. కరోనా వల్ల చెడు జరుగుతున్నా.. మనుషుల బండారాలు బయటపడుతుండడం విశేషం.