వైసీపీ లో `కో ఆప్షన్` రాజకీయం..!
అధికార పార్టీ వైసీపీలో నేతలకు చేతుల్లో డబ్బులు ఆడడం లేదు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు చేతిలో పనులు కూడా లేకుండా పోయాయి. దీంతో అందివచ్చిన ప్రతి మార్గాన్నీ వారు వినియోగించుకుంటున్నారు. ఎక్కడ అవకాశం చిక్కితే.. దానిని తమకు లాభసాటిగా మార్చుకుంటున్నారు. ఇన్నాళ్లుగా ఇసుక, మట్టి వంటి విషయాల్లో వేలు పెట్టి సంపాయించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై జగన్ సీరియస్ కావడం.. ఆ వెంటనే కొన్ని రోజులు నేతలు మౌనం పాటించడం.. మళ్లీ దూకుడుగా ఉండడం కామన్‌గా మారిపోయింది. ఇక, ఇప్పుడు జగన్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం.. ఎమ్మెల్యేలకు అనుకూలంగా మారిందని అంటు న్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీనే పాగా వేసింది. ఈ క్రమంలో కౌన్సిలర్ పదవులను వ్యూహాత్మ కంగా బీసీలకు, మహిళలకు.. కేటాయించారు. కొన్ని జనరల్ స్థానాలను కూడా .. బీసీలకు ఇచ్చారు. అదేసమయంలో గెలిచిన వారిలో కొత్త ముఖాలు కూడా ఈ పదవులు దక్కించుకున్నాయి. ఈ పదవుల పంపకంలో పెద్ద గా ఎవరూ జోక్యం చేసుకోకుండా.. సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. దీంతో.. లోకల్ నేతలు వేలు పెట్టలేక పోయారు. అదే సమయంలో స్థానికం గా పార్టీలో సీనియర్ అయి ఉండి.. మునిసిపాలిటీలో గెలిచినా.. చైర్మన్ గిరీని అందుకోలేక పోయిన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిని సంతృప్తి పరిచేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.
ప్రతి మునిసిపాలిటీలోనూ ఇద్దరేసి చొప్పున అదనంగా `కో ఆప్షన్ సభ్యులను` నియమిస్తూ.. జీవో ఇచ్చారు. దీనికి ఇటీవల గవర్నర్ కూడా ఆమోదముద్ర వేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక, నియామకాల బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగిస్తూ.. సీఎం మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు.. ఈ విషయంలో వివాదాలకు తావు ఉండరాదని కూడా పేర్కొన్నారు. అయితే.. చాలా జిల్లాల్లో స్థానికంగా బలంగా ఉన్న ఎమ్మెల్యేలు.. ఈ కో ఆప్షన్ పదవులను బేరం పెట్టారని.. ఎక్కవ మొత్తంలో ఎవరు చదివిస్తే.. వారికే ఈ పదవులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా పదేళ్లుగా పార్టీలోనే ఉండి.. ఆర్థికంగా బలంగా లేని వారు ఇటీవల స్థానికంలో విజయం సాధించారు. ఇలాంటి వారు.. ఈ పదవులు కోరుకుంటున్నారు. అయితే.. వీరికి కూడా చైర్మన్ కు ఉండే పవర్ ఉండడం.. అంతో ఇంతో చెక్ పవర్ కూడా ఉంటుందని ప్రచారంలో ఉండడంతో తమ వారికి ఇప్పించుకునేందుకు కొందరు.. అమ్మేసుకునేందుకు మరికొందరు.. ఇలా వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పదవులు ఆశిస్తున్న వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా .. తమ గోడు వినాలని.. పార్టీ కోసం పనిచేస్తున్నవారిని పట్టించుకోవాలని వారు కోరుతున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.