'జగనన్న పచ్చతోరణం' ప్రారంభించిన సీఎం జగన్!

Update: 2020-07-22 07:15 GMT
కరోనా వైరస్ సంక్షోభ సమయంలో కూడా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు  సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. తాజాగా జగన్ సర్కార్ మరో పథకానికి శ్రీకారం చుట్టారు. ఏపీ అటవీశాఖ 71వ వన మహోత్సవం సందర్భంగా ..  జగనన్న పచ్చతోరణంను సీఎం జగన్ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం గాజులపేట లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా  సీఎం జగన్,  మంత్రులతో కలిసి మొక్కలు నాటారు. ఆ తరువాత  సీఎం అందరితో ప్రతిజ్ఞ‌ చేయించారు. జగనన్న పచ్చతోరణం’  కింద  20 కోట్ల మొక్కలు నాటడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేసింది.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మొక్కలు నాటాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం అని తెలిపారు. రాష్ట్రంలో 13వేల పంచాయితీలు ఉంటే, 17 వేల లే అవుట్లు సిద్ధం చేశామని.. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ పది మొక్కలు నాటాలనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది .రాష్ట్రంలో ఉన్న  16 వేల మంది  గ్రామ వాలంటీర్ల ద్వారా ఒక్కొక్కరికి పది మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఇన్స్ట్యూషనల్ ప్లాంటేషన్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు నాటనున్నారు.
Tags:    

Similar News