3పీఎం ఏపీ సీఎం జగన్ భేటీకి ఎవరెవరు?
సినీప్రముఖులు ఏపీ సీఎం జగన్ తో భేటీకి రెడీ అవ్వడంపై గత కొద్దిరోజులుగా విస్త్రతంగా చర్చ సాగుతోంది. వైజాగ్ స్టూడియోల కోసమే!! అంటూ బాలకృష్ణ బాంబ్ పేల్చడంతో అప్పటికే సినీపెద్దలంతా అలెర్టయ్యారు. ఎట్టకేలకు నేడు (జూన్ 09) 3 పీఎం ఏపీ సీఎం జగన్ తో భేటీకి సిద్ధమవుతున్నారు.
ఈ భేటీలో వైజాగ్ టాలీవుడ్ సహా ఇండస్ట్రీ సమస్యలపైనా.. ప్రభుత్వ నంది అవార్డు కార్యక్రమాల పైనా మాటా మంతీ సాగించనున్నారు. క్రైసిస్ వేళ షూటింగుల పునరుద్ధరణ ఇంపార్టెంట్ టాస్క్. అలాగే ఏపీకి గ్లామర్ ఇండస్ట్రీ అవసరంపైనా జగన్ భేటీలో చిరంజీవి ప్రస్థావిస్తారన్న చర్చా సాగుతోంది. కొత్త పరిశ్రమ కోసం భూములు కోరతారని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఈ భేటీకి ఏకంగా 50 మంది పరిశ్రమ ప్రముఖులు హాజరవుతారని ప్రచారమైంది. కానీ ఇంతలోనే ఊహించని బిగ్ ట్విస్ట్.
సీఎం పేషీ నుంచి అంతమందికి అనుమతులు మంజూరు కాలేదని తెలుస్తోంది. సింపుల్ గా ఐదుగురు మాత్రమే ఎటెండవ్వాలని కోరితే.. మరో ముగ్గురిని కలుపుకుని ఎనిమిది మందికి అనుమతి సంపాదించారట. మొత్తానికి ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవి- కింగ్ నాగార్జున- దర్శకధీరుడు రాజమౌళి- చాంబర్ తరపున దామోదర్ ప్రసాద్- మండలి తరపున సి. కళ్యాణ్- దిల్ రాజు- సురేష్ బాబు అటెండవుతున్నారట. అయితే ఈ భేటీల జగన్ కి అత్యంత సన్నిహితంగా మెలిగే పూరి జగన్నాథ్ కానీ.. కళ్యాణ్ కృష్ణ కానీ పిలుపు అందుకోలేదని తెలుస్తోంది.
చిరంజీవి నాయకత్వంలో నాగార్జున- దగ్గుబాటి సురేష్ బాబు - రాజమౌళి బృందం ``వైజాగ్ టాలీవుడ్`` పై సరికొత్త ప్రతిపాదన తెస్తారనే భావిస్తున్నారు. ఈ భేటీలో స్టూడియోల నిర్మాణానికి స్థలాలు కోరే వీలుందని అంచనా వేస్తున్నారు. రొటీన్ మీటింగులా కాకుండా ఇదో చారిత్రాత్మక నిర్ణయానికి తెర తీసేదిగా ఉంటుందని ఇప్పటికే ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే జగన్ సానుకూలంగా స్పందిస్తే సామాజిక వర్గాలతో పని లేకుండా వైజాగ్ ఇండస్ట్రీ ఏర్పాటునకు పరిశ్రమ వైపు నుంచి పూర్తి సపోర్టు నివ్వాలని నిర్ణయించారని ఇన్ సైడ్ గుసగుస వినిపిస్తోంది.