సిమ్ లేకుంటే వాట్సప్ పని చేయదంతే !
ఇది కొత్త రూల్. అమలు అయ్యేది మార్చి ఒకటవ తేదీ నుంచి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటనను తాజాగా చేసింది.;
ఇది కొత్త రూల్. అమలు అయ్యేది మార్చి ఒకటవ తేదీ నుంచి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటనను తాజాగా చేసింది. దీని ప్రకారం ప్రతీ వారి మొబైల్ ఫోన్ లో వాట్సప్ పనిచేయాలంటే కచ్చితంగా సిమ్ ఆ ఫోన్ లో ఉండి తీరాల్సిందే. లేకపోతే వాట్సప్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఇలా సిమ్ అన్నది ప్రతీ ఫోన్ లో తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం అతి ముఖ్య నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఫిబ్రవరి 28 డెడ్ లైన్ కూడా పెట్టేసింది. ఇక మీదట ఈ గడువు కూడా పొడిగించేందుకు ఏ మాత్రం ఆస్కారం ఉండదని స్పష్టం చేసింది.
సైబర్ క్రైం తో సహా :
కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం వెనక మంచి ఉద్దేశ్యమే ఉంది. సైబర్ క్రైం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెరిగిపోతోంది. అలాగే జాతీయ భద్రతకు సంబంధించి కూడా ముప్పు వాటిల్లే విధంగా కొందరు ప్రవర్తిస్తున్నారు. దీంతో వీటిని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం తీసుకుని వస్తున్న కొత్త నిబంధల ప్రకారం చూస్తే వాట్సప్ అలాగే టెలిగ్రాం, సిగ్నల్, స్నాప్ చాట్, షేర్ చాట్, జియో చాట్, అరాటై, జోష్ లాంటి సోషల్ మీడియా వినియోగానికి మొబైల్ ఫోన్ లో సిమ్ ఉంటేనే సాధ్యపడుతుంది అని పేర్కొంది.
ఆటోమేటిక్ గా లాగౌట్ :
మరో ముఖ్య విషయం ఏంటి అంటే పర్సనల్ కంప్యూటర్ లో లాగిన్ చేసిన వాట్సప్ సైతం కచ్చితంగా ఆరు గంటల తరువాత ఆటోమేటిక్ గా లాగౌట్ అయిపోతుంది. గతంలో అయితే ఒకసారి కంప్యూటర్ లో లాగిన్ అయితే అది ఎన్ని రోజులు అయినా నెలలు అయినా ఓపెన్ చేయగానే రన్నింగ్ లో ఉండేది. కానీ ఇపుడు అలా అసలు కాదు, కేవలం ఆరు గంటల పరిమితితోనే కంప్యూటర్ లో వాట్సప్ రన్నింగ్ లో ఉంటుంది మళ్ళీ కావలిస్తే లాగిన్ అవాల్సిందే అన్న మాట. ఇది కూడా సైబర్ నేరస్థుల విషయంలో కఠినంగా వ్యవహరించేందుకే కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంగా చెబుతున్నారు.
సిమ్ కి ఇవన్నీ ఉండాల్సిందే :
ఇక సిమ్ అన్నది రిజిష్టర్ చేసినది అయి ఉండాలి. అలగే రీఛార్జ్ చేసిన సిం మాత్రమే పనిచేస్తుంది. ఈ విధంగా రూల్స్ ని ఫ్రేమ్ చేయడం వెనక మరింతగా మొబైల్ వినియోగదారులకు వాట్సప్ యూజర్లకు అలాగే కంప్యూటర్ లో వాట్సప్ కనెక్ట్ అయి ఉన్న వారికి మేలు జరుగుతుంది అని అంటున్నారు. ఇది మంచి విషయమే అని చెబుతున్నారు. దీనిని అర్ధం చేసుకుని అంతా సిమ్ బైండింగ్ కి అలవాటు పడాలని సూచిస్తున్నారు.