కాళ్లు కడిగి క్షమాపణ చెప్పిన సీఎం.. అసలేం జరిగింది?
మధ్యప్రదేశ్ లో గిరిజన కూలీ దశమత్ రావత్ పై బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పబడుతున్న ప్రవేశ్ శుక్లా మూత్రం పోసిన ఘటన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేతలు మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్ అగ్ర నేతలు.. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సైతం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం చేశారు.
మరోవైపు గిరిజన కూలీపై మూత్రం పోసిన వ్యక్తి ఇంటిని పోలీసులు బుల్డోజర్ తో కూల్చివేశారు. కాగా నిందితుని అక్రమ ఇంటిని బుల్డోజర్ తో కూల్చేసిన సమయంలో ఆయన తల్లి స్పృహ కోల్పోయారు.
నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ప్రవేశ్ శుక్లాపై ఐపీసీ సెక్షన్లు 294 (అసభ్యకర చర్యలకు పాల్పడటం), 504 (శాంతికి భంగం కలిగేవిధంగా ఉద్దేశపూర్వకంగా అవమానించడం), ఎస్సీ, ఎస్టీ చట్టం, జాతీయ భద్రత చట్టం కింద కేసులు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు గిరిజనుడిపై మూత్రం పోసిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రకంపనలు సృష్టించడంతో మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. అందులోనూ ఈ ఏడాది చివరలో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అప్రమత్తమయ్యారు.
ఈ క్రమంలో సిద్ధి జిల్లాలో బీజేపీ నేత ప్రవేశ్ శుక్లా అవమానించిన గిరిజనుడికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ క్షమాపణ చెప్పారు. బాధితుడి పాదాలను కడిగి, అతడిని శాలువాతో సత్కరించారు. నిందితుడు ప్రవేశ్ శుక్లాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అంతకుముందు ట్వీట్ కూడా చేశారు. సిద్ధి జిల్లాలో ఓ వ్యక్తి మరొక వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోందని, ఆ విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి, జాతీయ భద్రత చట్టం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడిని, ఆయన కుటుంబ సభ్యులను తాను భోపాల్ లో కలుస్తానని చెప్పారు.
ఈ నేపథ్యంలో బాధితుడు దశమత్ రావత్ ను శివరాజ్ సింగ్ చౌహాన్ జూలై 6న కలిశారు. రావత్ ను కుర్చీలో కూర్చోబెట్టి, ఆయన పాదాలను సీఎం శివరాజ్ కడిగారు. ఆయనకు శాలువ కప్పి సత్కరించి, క్షమాపణ చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ వేదికగా సీఎం కార్యాలయం షేర్ చేసింది.