'వ్యవసాయేతర’ రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష..సుప్రీం కోర్టుకా?
తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ లు మాత్రమే జరుగుతున్నాయి. కోర్టు కేసుల వలన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు ఎదురైయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో జరుగనున్న ఈ సమావేశంలో వ్యసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో చర్చించనున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా ప్రభుత్వానికి అందలేదు. అందిన తర్వాత దానిపై కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టు కు వెళ్లడమా లేదంటే తగు విధమైన విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా అనే అంశంపై రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.