ఆరేళ్లు అవుతున్నా.. ఉమ్మడి పాలనపై కేసీఆర్ పంచ్ లు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మించిన అదృష్టవంతుడు మరొకరు ఉండదు. ఏ సమస్య వచ్చిన పడినా.. ఉమ్మడి రాష్ట్ర పాలననను ఎత్తి చూపించి విమర్శలు చేయటం.. విరుచుకుపడటం లాంటివి ఆయన చేస్తుంటారు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు. చరిత్రలో ఎప్పుడు లేని రీతిలో భారీగా కురిసిన వర్షంతో వరంగల్ పట్టణం జలసంద్రంగా మారటం తెలిసిందే. ఈ పట్టణం మొత్తం చెరువులా మారిపోయిన వైనంతో వరంగల్ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణ సర్కారుపైనా ఒత్తిడి పెరిగింది.
ఈ నేపథ్యంలో ఆయన తన అమ్ములపొదిలో ఉన్న ఏపీ ఉమ్మడి పాలనను తెర మీదకు తీసుకొచ్చారు. వానలు.. వరదలు వస్తే ఏం చేయాలనే అంశానికి సంబంధించి ఆంధ్రా ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చర్యలు తీసుకున్నారని.. తెలంగాణను మాత్రంపట్టించుకోలేదన్న ఘాటు విమర్శలు చేశారు. ఈకారణంతోనే తెలంగాణలో వానలు.. వరదలు వచ్ినా.. విపత్తులు వచ్చినా పరిగణలోకి తీసుకోలేదని తప్పు పట్టారు.
దీనిని సరిదిద్దేందుకు ఫ్లడ్ మేనేజ్ మెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీని తయారు చేయాలన్నారు. వానాకాలంలో ఏ చర్యలు తీసుకోవాలనే విషయంలో వ్యూహాన్ని రూపొందించటం ద్వారా.. అమలు చేయాలంటున్నారు. ఇన్నిమాటలు చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి ఆరేళ్లు కావటంతో పాటు.. ఈ సమయమంతా తామే అధికారంలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోతున్నట్లు ఉన్నారు.
ప్రజల భావోద్వేగాల్నిటచ్ చేయటం ద్వారా సమస్యను పక్కదారి పట్టించాలన్న వ్యూహంతోనే ఉమ్మడి పాలనపై విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. ఉమ్మడి పాలనలో వానలు.. వరదలు వస్తే.. దాన్ని ఎదుర్కొనే మేనేజ్ మెంట్ ఏపీలో భారీగా చేపట్టి ఉంటే.. ప్రతి అల్పపీడన సమయంలోనూ ఏపీలోని పలు ప్రాంతాలు ఎందుకంతలా ప్రభావితం అవుతుంటాయి? అన్నది ప్రశ్నే.
ఏపీ సంగతి వదిలేద్దాం. తెలంగాణ విషయానికి వద్దాం.ఈ రోజుకు సరిగ్గా వాన దంచి కొట్టాలే కానీ హైదరాబాద్ నగరం మొత్తం అతలా కుతలమైపోయే పరిస్థితి. గడిచిన ఆరేళ్లలో దీనికి సంబంధించిన ఏదైనా వ్యూహాన్ని కేసీఆర్ సర్కారు సిద్ధం చేసిందా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైనా సమస్య వచ్చినంతనే..ఉమ్మడి పాలనలో తప్పులంటూ ఎత్తి చూపించే కేసీఆర్.. ఆరేళ్ల తన పాలనను పరిగణలోకి తీసుకోకపోవటం గమనార్హం. ఎంతకాలం ఉమ్మడి పాలన భుజాల మీద ఎక్కుపెట్టి విమర్శనాస్త్రాల్ని సంధిస్తారు? అన్నది అసలు ప్రశ్న.