భారీ వర్షంతో తెలంగాణ నష్టం లెక్క చెప్పిన సీఎం కేసీఆర్
భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. రాష్ట్రంలోని మూడు.. నాలుగు జిల్లాలు మినహాయిస్తే మిగిలిన రాష్ట్రం మొత్తం తీవ్రంగా ప్రభావితమైంది. భారీగా మరణాలతో పాటు.. లక్షలాది ఎకరాల్లో పంట మునక.. పెద్ద ఎత్తున ఇళ్లల్లోకి నీళ్లు రావటంతో భారీ నష్టం చోటు చేసుకుంది. భారీ వర్షం.. వరదల కారణంగా చోటు చేసుకున్న నష్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా మదింపు చేసింది. వారిలెక్కల ప్రకారం ఇప్పటికి జరిగిన నష్టం రూ.5వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ నష్టం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. తక్షణ పునరావాస చర్యల్లో భాగంగా రూ.1350 కోట్ల సహాయాన్ని అందించాలని కేంద్రాన్నికోరింది రాష్ట్ర సర్కార్.
రైతులకు సాయం అందించటానికి రూ.600 కోట్లు.. జీహెచ్ఎంసీతో పాటు ఇతర ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం రూ.750 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీనికి సంబంధించి ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.35 లక్షల ఎకరాలు మునిగిపోయాయని.. యాభై మంది మరణించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 101 చెరువు కట్టలు తెగినట్లుగా తేల్చారు. 26 చెరువు కట్టలకు బుంగలు పడ్డాయని.. జలవనరుల శాఖకు రూ.50 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని.. పంచాయితీరాజ్ రోడ్లు భారీగా దెబ్బ తిన్నట్లుచెబుతున్నారు.
వర్షం ధాటికి పలుచోట్ల రోడ్లు దెబ్బతినటంతో.. వాటి నష్టమే రూ.295 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. జాతీయ రహదారులు ప్రభావితమయ్యాయి. వర్షాల కారణంగా జరిగిన నష్టం రూ.11 కోట్లు ఉంటుందని లెక్క తేల్చారు. వర్షాల కారణంగా భారీగా జరిగిన నష్టం నేపథ్యంలో కేంద్రం తమను ఆదుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ కోరుతున్నారు. మరి.. దీనికి కేంద్రం ఏ రీతిలో రియాక్టు అవుతుందో? ఎంత మొత్తాన్ని విడుదల చేస్తారో చూడాలి.