చెవిరెడ్డికి సీఎం జగన్ అభినందన

Update: 2020-11-27 15:30 GMT
తీరం దాటిన నివర్ తుఫాన్ ఏపీని వణికిస్తోంది. భారీ వర్షాలతో హోరెత్తిస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా ఈ వర్షాలకు అతలాకుతలం అవుతోంది. తాజాగా కురిసిన వర్షానికి రాగుళ్లు వాగ ఉప్పొంగింది. ఆ వరదలో ముగ్గురు రైతులు కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకోగా.. మరొకరు మృతిచెందారు.

రైతులను కాపాడేందుకు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూపించిన చొరవ, సహాయక సిబ్బందిని సమన్వయ పరిచిన తీరుకు సీఎం జగన్ అభినందించారు. పలువురు నుంచి కూడా ప్రశంసలు అందాయి.

ముగ్గురు రైతులు పొలం వద్దకు వెళ్లి  రాగుళ్ల వాగులో చిక్కుకున్నారు. దాదాపు అరకిలోమీటరు దూరం కొట్టుకుపోయారు. ఇద్దరు చెట్టును పట్టుకొని కాపాడాలని కోరగా..ప్రసాద్ అనే వ్యక్తి మృతిచెందాడు.

సీఎం కార్యాలయం ద్వారా తుడా చైర్మన్ చెవిరెడ్డికి సమాచారం అందగానే ఆయన వేగంగా స్పందించారు.హెలికాప్టర్ తెప్పించినా వాతావరణం వల్ల వీలుకాలేదు. దీంతో స్పీడు బోటును తెప్పించారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది వెళ్లి రైతులను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. రైతులను కాపాడడానికి చెవిరెడ్డి చూపిన చొరవను సీఎం అభినందించారు.
Tags:    

Similar News