డ్రగ్స్ కేసు: హీరోయిన్ తో సంబంధం లేదన్న బీజేపీ
కర్ణాటక సినీ ఇండస్ట్రీని ఇప్పుడు డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. ప్రముఖ సినీ నటులు ఇందులో ఇన్ వాల్వ్ అయ్యి ఉండడం ప్రకంపనలు సృష్టిస్తోంది. రవిశంకర్ అనే వ్యక్తిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారం ప్రకారం తాజాగా శాండిల్ వుడ్ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేదిని సైతం పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం సంచలనమైంది.
అయితే రాగిణి ద్వివేదికి అధికార బీజేపీకి సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు.. ఆమె బీజేపీతో నేతలతో సన్నిహిత సంబంధాలుండగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె బీజేపీ నేత అని ప్రతిపక్షాలు హోరెత్తిస్తున్నాయి.
ప్రతిపక్షాల ఆరోపణలపై కర్ణాటక బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ఆమెతో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటించింది. ఆమె వ్యక్తిగతంగా బీజేపీకి ప్రచారం చేసి ఉండొచ్చని.. అంతే తప్ప ఆమెకు బీజేపీతో సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది.