రేప్ బాధితురాలిని పెళ్లి చేసుకోమని చెప్పలేదు: సుప్రీం క్లారిటీ
అత్యాచారానికి గురైన బాలికను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని నిందితుడిని ప్రశ్నించిన సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. వీటిపై తాజాగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే స్పష్టతనిచ్చారు.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని.. మహిళలంటే తమకు అపారమైన గౌరవం ఉందని సీజే బొబ్డే వెల్లడించారు. 'బాధితురాలిని పెళ్లి చేసుకోమని మేం అతడిని అడగలేదు. పెళ్లి చేసుకోబోతున్నావా? అని ప్రశ్నించాం. అంతేగానీ అతడికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు' అని సీజేఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది.
ఇటీవల ఓ అత్యాచార కేసులో నిందితుడి బెయిల్ పిటీషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర విద్యుత్ ఉత్పాదన సంస్థలో టెక్నీషియన్ గా పనిచేస్తున్న మోహిత్ సుభాష్ చవాన్ (23)పై అత్యాచారం కేసు నమోదైంది. బాలికపై పలు మార్లు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందింది. దీనిపై హైకోర్టు బెయిల్ తిరస్కరించగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు 'బాధిత బాలికను పెళ్లాడుతారా? అని అడిగింది. దీనికి మేమేం ఒత్తిడి తేవడం లేదని వివరణ ఇచ్చింది. అయితే బాధితురాలిని పెళ్లి చేసుకోమని సుప్రీంకోర్టు అడగడం దుమారం రేపింది. దీనిపై వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ వ్యాఖ్యలపై జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టతనిచ్చింది.