సీఐ బత్తుల శ్రీనివాసరావు రైసు మిల్ కథ వింటే అవాక్కే

Update: 2021-09-28 06:30 GMT
ఆయన పేరు బత్తుల శ్రీనివాసరావు. చేసేది సీఐ ఉద్యోగం. అయితే.. ప్రస్తుతం పలు ఆరోపణలు.. కేసుల కారణంగా సస్పెన్షన్ లో ఉన్న ఆయనపై వస్తున్న ఆరోపణలు అన్నిఇన్ని కావు. తాజాగా ఆయన లీలల గురించి ఏపీ అధికార పక్షానికి చెందిన మీడియాలో భారీ కథనాన్ని అచ్చేసిన వైనం చూస్తే.. అయ్యగారి లెక్కలు ఎంతలా ఉంటాయన్నది అర్థం కావటమే కాదు.. ఆయన లీలలు తెలిస్తే ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. ఇంతకీ ఆయన చేసేది పోలీసు ఉద్యోగమైతే.. ఈ రైసు మిల్లు వ్యాపారం ఏమిటి? అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

గుంటూరు రేంజ్  పరిధిలో పలు ప్రాంతాల్లో బత్తుల శ్రీనివాసరావు ఎస్ ఐ గా.. సీఐగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం సస్పెన్షన్ వేటుతో ఉద్యోగానికి దూరంగా ఉన్నా.. ఆయన ప్రభావం మీద మాత్రం బత్తుల పని చేసి స్టేషన్ల మీద చాలానే ఉందంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారాలు చేయకూడదన్న రూల్ ను పక్కన పెట్టేసి మరీ తాను రైసుమిల్లు కడుతున్నట్లుగా తనకుతెలిసిన వారు.. పరిచయస్తుల నుంచి భారీగా డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

గుంటూరుకు చెందిన బిందు అనే మహిళ దగ్గర రూ.1.4 కోట్లను అప్పుగాతీసుకున్న అతను గడిచిన ఐదేళ్లలో ఒక్క రూపాయి చెల్లించలేదంటున్నారు. తెనాలికి చెందిన చంద్రమ్మ అనే మహిళ వద్ద రూ.15 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వకపోవటంతో మోసం కేసును ఎదుర్కొంటున్నారు. అన్నింటి కంటే హైలెట్ ఏమంటే.. గుంటూరుకు చెందిన ప్రభుదాస్ అనే వ్యక్తి విద్యుత్ శాఖలో లైన్ మెన్ గా పని చేశారు. తనకున్న పరిచయంతో తాను రైస్ మిల్లులో షేర్లు ఇస్తానని.. సూపర్ వైజర్ గా జాబ్ ఇస్తానని చెప్పటంలో సదరు వ్యక్తి బత్తుల అకౌంట్ కు రూ.34.84లక్షల మొత్తాన్ని అకౌంట్ ట్రాన్సఫర్ చేశాడు. ఆ తర్వాత నుంచి పత్తా లేకుండా పోయాడు.

ఇలా.. పలువురు వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న బత్తుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రియ పేరుతో రైస్ మిల్లు ప్రారంభిస్తున్నట్లుగా డబ్బులు దండుకోవటం.. వాటాలు ఇవ్వలేదన్న ఆరోపణలు.. కేసులు ఉన్నట్లుగా డీఐజీ తివిక్రమవర్మ నిర్దారించారు.

తాజాగా వస్తున్న ఆరోపణ ఏమంటే.. విచారణ మీద ప్రభావితం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. సీఐగారి రైసుమిల్లు ఏమో కానీ.. సామాన్యులకు భారీ షాకులు ఇచ్చిందంటున్నారు. 
Tags:    

Similar News