ఎన్నికలు దగ్గర అవుతున్న టైం లో ఓపెన్ అవుతున్న మెగాస్టార్

Update: 2023-01-02 13:39 GMT
మెగాస్టార్ చిరంజీవికి నాలుగు దశాబ్దాలకు పైగా సినీ చరిత్ర ఉంది. ఆయన అంటే ఒక తరానికి ఉత్సాహం. మరో తరానికి ఆదర్శం. వర్తమాన తరానికి డెమ్మీ గాడ్ ఫీలింగ్. ఈ రోజుకీ  చిరంజీవి జోష్ తగ్గలేదు. ఆయన చేసే డ్యాన్సులలో గ్రేస్ తగ్గలేదు. అదే పవర్ ఫుల్ లుక్, అదే పవర్ ఫుల్ మాడ్యులేషన్ తో డైలాగ్ డెలివరీ. కంటి చూపులో వాడి వేడి ఇవన్నీ మెగాస్టార్ చరిష్మాను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నాయి.

ఇదిలా ఉంటే సినిమా సినిమాకు మధ్య జరిగే మీడియా మీటింగ్స్ లో మెగాస్టార్ ఏపీ పాలిటిక్స్ గురించి కూడా కొంత చర్చకు తెస్తున్నారు. అది ఆయన కోరి కాకున్న మీడియా ప్రశ్నలకు ఆయన జవాబులుగానే ఉంటున్నాయి. గాడ్ ఫాదర్ టైం లో ఆయన రాజకీయానికి నేను దూరంగా ఉన్నా అది నాకు దగ్గరగానే ఉంది అంటూ పవర్ ఫుల్ డైలాగ్ పేల్చారు. అయితే అది సినిమాలోనిది. ఇక మీడియా చిట్ చాట్ లో పవన్ లో మంచి నాయకుడు ఉన్నాడని, ఆయన తప్పకుండా ఏదోనాటికి మంచి ప్రజా నాయకుడు అవుతాడు అని అన్నగా ఆశీర్వదించారు.

దాంతో జనసేన వైపు మెగాస్టార్ చూపు ఉందని అప్పట్లోనే ప్రచారం సాగింది. దాని మీద చర్చోపచర్చలు కూడా సాగాయి. ఇపుడు చూస్తే వాల్తేరు వీరయ్య సినిమా హడవుడిలో మెగాస్టార్ ఉన్నారు. మళ్ళీ మీడియాతో ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తమ్ముడిని చిరంజీవి తెగ పొగిడేశారు. తన తమ్ముడు నిస్వార్ధమైన వారు అని నిన్నటి దాకా సొంత ఇల్లు కూడా లేని వాడు అని అవినీతి నిర్మూలన కోసమే రాజకీయ పార్టీ పెట్టాడు అంటూ జనసైనిక్స్ మనసు ఉప్పొంగేలా చాలా మాట్లాడారు.

ఇక తాను పెంచిన బిడ్డ పవన్ కళ్యాణ్ అని మరో మాట చెప్పారు. తన బిడ్డ లాంటి పవన్ని ఎవరైనా ఏమైనా అంటే అది తనను విపరీతంగా బాధిస్తుంది అని మెగాస్టార్ తండ్రి హృదయంతో ఆవేదన వ్యక్తం చేయడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఇంతకు ముందు ఎపుడూ పవన్ని ఇంతలా మెచ్చుకున్నది లేదు, పవన్ కి డబ్బు మీద అధికారం మీద ఎలాంటి వ్యామోహం లేదని కూడా మెగాస్టార్ పవన్ లోని కొత్త కోణాన్ని అవిష్కరించారు.

ఇంతకాలం ఈ మాటను ఎవరో ఇతర నాయకులు అన్నారు కానీ పవన్ గురించి సొంత అన్నయ్యగా ఆయన్ని చిన్నప్పటి నుంచి పెంచిన వారిగా మెగాస్టార్ చెప్పడం అంటే అది ఇంకా బాగా జనాల్లోకి వెళ్తుంది అన్నది నిజం. మరి తన తమ్ముడు మంచి లీడర్ అవినీతి వ్యతిరేక పోరాటయోధుడు అంటూ చిరంజీవి ఇస్తున్న ఈ స్టేట్మెంట్శ్ చూస్తూంటే ఏపీ రాజకీయాల మీద మెగా ఫోకస్ పడిందా అన్న చర్చ అయితే  ఉంది.  ఎంతైనా తమ్ముడు. ఆయనకు మెగా ఫ్యామిలీ అండగా ఉండాల్సిన క్రూషియల్ పీరియడ్ ఇది.

వచ్చే ఎన్నికల్లో తలా ఒక చేయి వేస్తే కచ్చితంగా ఏపీలో జనసేన ఇంపాక్ట్ చాలా ఉంటుంది అని అంటున్నారు జనసేనకు మెగా ఫ్యాన్స్ అండగా ఉంటున్నారు. ఇపుడు తండ్రి లాంటి చిరంజీవి వరసబెట్టి పవన్ మీద బ్లెస్సింగ్స్ రూపంలో ప్రకటనలు అనుకూలంగా చేస్తున్నారు. ఎన్నికలకు కచ్చితంగా మరో పదిహేను నెలలు మాత్రమే ఉన్న వేళ చిరంజీవి ప్రకటన వెనక ఆంతర్యం ఏంటి అన్న చర్చ కూడా వస్తోంది.

ఇంతకాలం చిరంజీవి వేరు పవన్ వేరు అని వైసీపీ వారు మాట్లాడుతూ వచ్చారు. వారిని గాడ్ ఫాదర్ టైం లో మెగా షాక్ ఇచ్చి తన తమ్ముడు గొప్పోడు అని చెప్పిన చిరంజీవి కొత్త ఏడాది పూర్తిగా కళ్ళు తెరిపించేశారు అని అంటున్నారు. అర్జునుడికి కృష్ణుడు మాదిరిగా వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో ఆయుధం పట్టకుండానే ప్రత్యర్ధులకు చమటలు పట్టించేందుకు మెగాస్టార్ రెడీ అయితే ఏపీ పాలిటిక్స్ లో సంచలనాలు నమోదు అవుతాయని అంటున్నారు. సో మెగాస్టార్ మాటల వెనక చేతలు ఏమిటి, అజెండా ఏంటి, ప్లానింగ్స్ ఏంటి అన్నవి ముందు ముందు తెలుస్తుంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News