భారత్ సరిహద్దుల్లో 628 గ్రామాలు నిర్మించిన చైనా !!
డ్రాగన్ దేశం తీరు రోజురోజుకు చాలా ప్రమాదకరంగా మారుతోంది. చైనా-భారత్ సరిహద్దుల్లో అంటే మన దేశానికి చాలా దగ్గరలో వందలాది గ్రామాలను ఏర్పాటు చేసేసింది. ఇందులో లక్షలాదిమందిని దింపేయబోతోంది. వీళ్ళంతా పేరుకు మాత్రమే గ్రామస్తులు. కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి చేస్తారో ? అసలెందుకు వీళ్ళని డ్రాగన్ ఇక్కడ ఉంచుతున్నదో కూడా అయోమయంగా తయారవుతోంది. మన అభ్యంతరాలను పక్కన పెట్టేసి అంతా తనకిష్టం వచ్చినట్లే చేసుకుపోతోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ ప్రభుత్వం సుమారు 628 గ్రామాలను నిర్మించింది. నిజానికి చైనా నిర్మించిన గ్రామాల్లో మామూలు జనాలు నివాసం ఉండటానికి ఏ మాత్రం సాధ్యం కాదు. విపరీతమైన చలి అదికూడా మైనస్ డిగ్రీల మధ్య మామూలు జనాలుండలేరన్నది అందరికీ తెలిసిందే. అది కూడా మైదాన ప్రాంతాల్లో కాదు. పర్వతాలు, మంచుకొండల్లో అంటేనే పరిస్థితి ఎలాగుంటుందో అర్థం చేసుకోవచ్చు.
సరిహద్దులో వందలాది గ్రామాలను నిర్మించేసి లక్షలాది మంది జనాలను ఏదో పెద్ద ప్లాన్ తోనే దింపుతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం నిర్మించిన 628 గ్రామాల్లో సుమారు 2.5 లక్షల మంది జనాలను ఉంచబోతోంది. ఈ గ్రామాల్లో జనాలు హ్యాపీగా ఉండటానికి అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలను అంటే మంచు పర్వతాలలో జీవించటానికి తగ్గట్లుగా ఏర్పాటు చేసింది. చైనా-భారత్ మధ్య 3500 కిలోమీటర్ల సరిహద్దుంది. ఈ సరిహద్దు వెంబడి ఇలాంటి గ్రామాలు కొన్ని వందల సంఖ్యలో ఏర్పాటు చేయాలని డ్రాగన్ ప్రభుత్వం డిసైడ్ చేసిందట. మరన్ని వందల గ్రామాలను రెడీ చేయబోతున్నదంటేనే వెనకాల ఏదో పెద్ద ప్లానే ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఇపుడు ఏర్పాటు చేసిన గ్రామాలు లడ్డాఖ్ నుండి నింగ్ చీ వెంబడే ఉన్న టిబెట్ సరిహద్దుల్లోను, అరుణాచల్ ప్రదేశ్-మయన్మార్ వెంబడే ఉన్న మెచూకాలో ఉంటాయి. ఈ గ్రామాల్లో మొత్తం 62,120 ఇళ్ళు నిర్మించారు. ఒకవైపు డ్రాగన్ చేస్తున్న పనులను గమనిస్తున్న భారత్ కూడా అందుకు ధీటుగానే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే మంచుపర్వతాల్లోకి జనాలను తరలించే పనులు మాత్రం చేయటంలేదు. ఇదే పద్దతిలో టిబెట్ సరిహద్దులో కూడా ఇలాంటి గ్రామాలనే నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
టిబెట్ సరిహద్దుల్లో నిర్మిస్తున్న గ్రామాల్లోని ప్రజలు టిబెట్+భారత్ సరిహద్దుల్లో జనాలు+సైన్యం కదలికలను గమనించి ఎప్పటికప్పుడు చైనా పాలకులకు అందచేస్తున్నారు. ఈ విషయం తెలిసినా మన సైన్యం ఏమి చేయలేకపోతోంది. ఎందుకంటే గ్రామాల్లో ఉంటున్న వారంతా మామూలు జనాలే. కాకపోతే మామూలు జనాలంతా నిజానికి మామూలు జనాలు కాదని సైనికులే జనాల ముసుగులో ఉన్నారనేది మన సైన్యం అనుమానం. ఏదేమైనా డ్రాగన్ దేశంతో మనకు ఎప్పటికప్పుడు ఏదో ప్రమాదం ముంచుకొస్తునే ఉంది. అప్రమత్తంగా ఉండటం తప్ప వేరే దారిలేదంతే.