కృత్రిమ సూర్యుడిని సృష్టించిన చైనా! భారత్, అమెరికాలకు ప్రమాదమే

Update: 2020-12-09 04:11 GMT
మరో కంత్రీ ప్లాన్ తెర పైకి తెచ్చారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించే చైనా సైంటిస్టులు తాజాగా మరో సూర్యుడిని తయారుచేశారు. శాస్త్రవేత్తలు న్యూక్లియర్​ ల్యాబ్​లో సూర్యుడిని తయారుచేసినట్టు చైనా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ల్యాబ్​ లో తయారు చేసిన సూర్యుడు సాధారణ సూర్యగోళం లాగే వేడిని, శక్తిని విడుదల చేస్తుందట. కొత్తగా తయారుచేసిన సూర్యుడిని హెచ్​ఎం2 టోకామర్​ రియాక్టర్​ అనిపిలుస్తున్నారు. సాధారణంగా సూర్యుడి పరమాణు కేంద్రంలోని అణువులు విచ్చిన్నమైనప్పుడు శక్తి విడుదలౌతుంది.  చైనా తయారు చేసిన సూర్యుడి లో ఇదే రకమైన రసాయనిక చర్య జరుగుతోంది.

కృత్రిమ సూర్యుడి ద్వారా విడుదలయ్యే శక్తితో చైనా అణు విద్యుత్​ ను తయారు చేయనున్నట్టు సమాచారం. చైనా కొత్తగా తయారుచేసిన రియాక్టర్​ ద్వారా సుమారు 15 కోట్ల డిగ్రీల సెల్సియస్​ శక్తి విడుదలవుతుందట. చైనా అణుబాంబుల తయారీకి కూడా ఈ రియాక్టర్​ ను వాడుకోవచ్చని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దీంతో చైనా అణుబాంబుల తయారీ మొదలుపెడితే ప్రపంచదేశాలన్నీ గడగడ లాడాల్సిందే.

ఇప్పటికే ప్రపంచంలోనే సూపర్​ పవర్​గా ఎదగాలనుకుంటున్న చైనా ఇటువంటి దుస్సాహసానికి ఒడిగట్టే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంజర్జాతీయ మీడియాలో చైనా వైఖరిని తప్పుపడుతూ పలు వార్త కథనాలు వెలువడ్డాయి.ఈ  విషయంలపై ఇంతవరకు చైనా మీడియా, ప్రభుత్వం స్పందించలేదు.
Tags:    

Similar News