చైనాకు దిమ్మ తిరిగే షాకివ్వాల్సిన టైం వచ్చేసింది
చైనాను డ్రాగన్ గా అభివర్ణిస్తారు. నిజమే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. ఆ దేశానికి ఉన్న పేరుకు తగ్గట్లే.. నిలువెల్ల విషాన్ని ఆదేశ మీడియా భారత్ మీద కక్కుతోంది. సిక్కిం సెక్టార్ లో భారత్ కు ఎర్త్ పెట్టటానికి.. భారత్ తో సన్నిహిత సంబంధాలున్న భూటాన్ ను దూరం చేయటానికి దుర్మార్గపు వ్యూహాల్ని అమలు చేయటం షురూ చేసింది.
భూటాన్ సరిహద్దుల్లోకి చొచ్చుకురావటం ద్వారా భారత్ కు పక్కలో భల్లెంలా మారాలని చైనా భావిస్తోంది. దీనికి చెక్ పెట్టేందుకు భారత్ ప్రయత్నాలతో చైనాకు చిర్రెత్తుతోంది. తొలుత యుద్ధం మాటల్ని తెర మీదకు తీసుకొచ్చి.. 1962 నాటి ఓటమిని గుర్తు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.
తాజాగా.. ఆ దేశపు అధికారిక మీడియా విషపు రాతల్ని రాయటం మొదలెట్టింది. ఏ ప్రాంతమైతే చైనాకు చిరాగ్గా మారిందో.. ఇప్పుడు అదే ప్రాంతాన్ని భారత్ నుంచి విడిపోవాలంటూ రెచ్చగొట్టే పని మొదలెట్టింది. భారత్ నుంచి విడిపోయే ప్రక్రియకు తాము సాయంగా నిలుస్తామని చెప్పటం ద్వారా తన దుర్మార్గపు బుద్ధిని బయటపెట్టింది.
సిక్కింను భారత్ నుంచి విభజించి.. స్వతంత్ర దేశంగా మార్చటం ద్వారా.. భారత్ కు భారీ నష్టాన్ని కలుగజేయాలన్న కొత్త వ్యూహాన్ని చైనా అధికారిక మీడియా తెర మీదకు తెచ్చింది.
చైనా సరిహద్దుల్లోని సిక్కిం రాష్ట్రంలో స్వాతంత్ర ఉద్యమానికి చైనా పౌరులు సహకరిస్తారని చెబుతూ.. హింసను పెంచేలా అడ్డగోలు రాతల్ని రాయటం మొదలెట్టింది. సిక్కింను భారత్ క్రూరంగా తన దేశంలో కలుపుకున్నదని దొంగమాటల్ని మొదలెట్టింది. సిక్కిం విషయంలో చైనా తన వైఖరిని మరోసారి ఆలోచించాలి. 2003లో సిక్కిం భారత్ లో కలుపుకోవటాన్ని చైనా గుర్తించినప్పటికీ.. ఇప్పుడు ఆ వైఖరిని మార్చుకోవచ్చు అని చైనా అధికారిక మీడియా గ్లోబల్స్ టైమ్స్ లో ఒక వ్యాసాన్ని అచ్చేసింది. మొత్తంగా చూస్తే.. ఒక చిన్న దేశంపై చైనా దుర్మార్గాన్ని పెద్ద మనసుతో ఆదుకునే ప్రయత్నం చేస్తున్న భారత్ ను దెబ్బ తీసేలా.. చైనా నాయకత్వానికి మరింత దుర్మార్గపు ఆలోచనలు వచ్చేలా గ్లోబల్ టైమ్స్ లో ఒక కథనాన్ని వండి వార్చింది. తాజా పరిణామాలు చూసినప్పుడు కలిగే భావన ఒక్కటే. ఇకపై.. చైనాకు షాకిచ్చే ఏ చిన్న అవకాశాన్ని కేంద్ర సర్కారు మాత్రమే కాదు.. 130 కోట్లకు పైగా భారతీయులు వదలనే వదలకూడదన్నది మర్చిపోకూడదు.