ఏపీ మంత్రులుగా వేణు, అప్పల్రాజు ప్రమాణం
ఏపీ కేబినెట్ లోకి ఇద్దరు కొత్త మంత్రులు వచ్చి చేరారు. విజయవాడ రాజ్ భవన్ దర్భార్ హాలులో కొత్త మంత్రులు వేణుగోపాల కృష్ణ , అప్పలరాజులు ప్రమాణం చేశారు. వీరితో గవర్నర్ హరిచందన్ ప్రమాణం చేయించారు.
ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతోపాటు పలువురు మంత్రులు.. కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కరోనా కారణంగా అతికొద్దిమందితోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
కొత్తగా ఇద్దరు మంత్రుల శాఖల కేటాయింపుతోపాటు సీనియర్ మంత్రి ధర్మానకు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇస్తారని సమాచారం. కొన్ని శాఖలు మారుతాయని.. డాక్టర్ అయిన కొత్త మంత్రి అప్పలరాజుకు వైద్యఆరోగ్యశాఖ ఇస్తారనే ప్రచారం వైసీపీలో సాగుతోంది.
*సీదిరి అప్పలరాజు ప్రొఫైల్
-శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.
-మత్య్సకార సామాజికవర్గం.. బీసీ కోణంలో మంత్రిపదవి
-1995లో రాష్ట్రస్థాయి పదోతరగతిలో 4వ ర్యాంకు
-కాకినాడ రంగరాయ వైద్యకాలేజీలో ఎంబీబీఎస్.
-ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో ఎండీ పట్టా
-కాశీబుగ్గలో 12 ఏళ్లుగా డాక్టర్ గా సేవలు
-2017లో వైసీపీలో చేరిక
-2019లో పలాస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక
*చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
-తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం అడవిపాలెం స్వగ్రామం.
-2001లో రాజోలు జడ్పీటీసీ
-2006లో జడ్పీ చైర్మన్
-2013లో వైసీపీలో చేరిక.. కాకినాడ రూరల్ ఇన్ చార్జి
-2014లో ఎమ్మెల్యేగా ఓటమి
-2019లో రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు