శృంగారంతో గుండెపోటుకు చెక్

Update: 2020-09-26 08:30 GMT
కరోనా-లాక్ డౌన్ వేళ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. తమ భాగస్వామితో శృంగార ఢోలికల్లో మునిగితేలుతున్నారు. మరి ఇన్నాళ్లు పనిరాక్షసులుగా మారిన వాళ్లంతా సంసార సుఖాన్ని అనుభవిస్తున్నారు.

అయితే శృంగారంతో గుండెపోటుకు చెక్ పెట్టవచ్చని తాజా పరిశోధనలో తేలింది. తాజాగా ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 495 జంటలపై 20 సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు. గుండెపోటుకు గురై కోలుకున్న తర్వాత అసలు సెక్స్ లో పాల్గొనని వారి కంటే మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్న వారు 35శాతం మేర మరణించే ప్రమాదాన్ని తగ్గించుకున్నారని అధ్యయనంలో తేలింది.

సెక్స్ తో వచ్చే శారీరక శ్రమ గుండెపోటును ప్రభావితం చేస్తాయన్న ఆందోళనలు చాలా మందిలో ఉన్నాయి. తాజా పరిశోధనలో తేలిన దాని ప్రకారం గుండెపోటుతో బాధపడుతున్న వారు రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనడం ద్వారా ఆ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చని తేలింది. సెక్స్ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది.

కాబట్టి గుండెపోటుతో బయటపడ్డ వారు నిస్సందేహంగా తమ సాధారణ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడమే మంచిదని తద్వారా మళ్లీ గుండెపోటుకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని అధ్యయనం తేల్చింది.
Tags:    

Similar News