అభ్యర్థి ఎవరో .. బీజేపీ ఇద్దరికి బీఫాం ఎందుకిచ్చింది ?

ఇక్కడి నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీ, బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Update: 2024-04-29 03:00 GMT

పెద్దపల్లి లోక్ సభ స్థానంలోని బీజేపీలో గందరగోళం నెలకొన్నది. ఎన్నికలకు సరిగ్గా పక్షం రోజుల సమయమే ఉన్న పరిస్థితుల్లో అక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరా ? అన్నది ఇప్పటికీ ఉత్కంఠగానే ఉన్నది. నామినేషన్ల ఉపసంహరణ ముగిస్తే గానీ ఆ విషయం బోధపడేలా లేదు.

ఇక్కడి నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీ, బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ నుండి గోమాస శ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటించారు. అభ్యర్థిగా ప్రకటించినా ఆయన ప్రచారం ప్రారంభించలేదని, కనీసం ప్రచార వాహనాలను కూడా సమకూర్చుకోలేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

దీంతో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని భావించారు. అయినా నామినేషన్ల చివరి రోజున గోమాస శ్రీనివాస్ కే బీఫాం ఇస్తూ అందులో అలర్ట్ అభ్యర్థి ఎస్. కుమార్ అనే పేరు చేర్చారు. దీంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిస్తే గానూ ఏ విషయం తేలని పరిస్థితి నెలకొంది.

అభ్యర్థి వ్యవహారం ఇలా ఉంటే పార్టీలో ముఖ్యనేతలు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, పెద్దపల్లి బీజేపీ ఇంఛార్జ్ దుగ్యాల ప్రదీప్ రావు వర్గాలు గోమాస శ్రీనివాస్ నామినేషన్ సంధర్బంగా నడిరోడ్డు మీద కొట్టుకోవడం చర్చానీయాంశం అయింది. మోడీ ఛరీష్మాతో ఉత్సాహంగా పనిచేస్తారు అనుకుంటే నాయకుల తన్నులాటలు అధిష్టానానికి బొప్పి కట్టిస్తున్నాయట. వ్యవహారం సద్దుమణిగేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News