ఇదేమి డేటింగ్ షో రా బాబోయ్!

Update: 2016-07-27 07:45 GMT
సాదారణంగా డేటింగ్ అంటే తమకు నచ్చినవాళ్ళతో అబ్బాయిలూ అమ్మాయిలూ కబుర్లు చెప్పుకుంటూ సినిమాలకు, షికార్లకు చెక్కేస్తూ ఉంటారు. దీన్ని అభిప్రాయాలు షేర్ చేసుకోవడం - ఒకరినొకరు అర్ధంచేసుకోవడం అని చెబుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే డేటింగ్ అలాంటి ఇలాంటిది కాదు. ఒళ్ళు జలదరించే న్యూడ్ డేటింగ్.. అది కూడా టీవీలో కనిపించే షో. ఈ స్థాయిలో షోతో చెలరేగిపోతోంది బ్రిటన్ లోని ఒక టీవీ చానల్!

వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్ లో ఛానల్-4 ఒక స్పెషల్ షో నిర్వహిస్తోంది. దీని ఫస్ట్ ఎపిసోడ్ ఈమధ్యే ప్రసారమైంది. ఈ షోలోకి అడుగుపెట్టగానే ఒక వ్యక్తి న్యూడ్ గా నిలబడాలి. మొదటిసారిగా ప్రసారమైన ఆ షోలో డేటర్స్ స్క్రీన్ వెనుక నిలబడటంతో కాళ్ళ దగ్గర్నుంచి మొదలుపెట్టి ఒక్కో వస్త్రం తీసేస్తూ ఉండగా.. చివరిగా అన్నీ చూపించేసిన తర్వాత ముఖాలను చూపించారు. మొదటి ఎపీసోడ్ లో ఏనుగు టాటూ ను తన ఒంటిపై పొడిపించుకున్న ఒక యువకుడ్ని బై సెక్సువల్ లింగరీ డిజైనర్ తన డేటర్ గా ఎంపిక చేసుకుందట. సెన్సార్ కాని న్యూడిటీకి అద్దంపడుతున్న ఈ షోపై రకరకాల విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా ఈ షో మరీ దిగజారుడుగా ఉందన్న మాటలే ఎక్కువగా వినపడుతున్నాయి. బట్టలులేకుండా డేటర్ ని ఎంపిక చేసుకోవడమేమిటో.. ఆ సీన్స్ ని టీవీలో ప్రత్యేకమైన షోగా ప్రసారం చేయడమేమిటో!!
Tags:    

Similar News