• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వినాయక చవితి మండపాలపై...

వినాయక చవితి మండపాలపై చంద్రబాబు సంచలన నిర్ణయం

By - Tupaki Desk
Update: 2021-09-06 12:30 GMT
ఏపీ సీఎం జగన్ పాలనపై టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. తెలంగాణలో వినాయక చవితి పూజలకు అనుమతించారని, ఏపీలో అభ్యంతరం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం వైఎస్ వర్థంతికి నివాళులు అర్పించిన వైసీపీ నేతలకు వర్తించని కోవిడ్ నిబంధనలు వినాయక చవితికి ఏ విధంగా వర్తిస్తాయని నిలదీశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ...ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఈ నెల 10వ తేదీన వినాయక చవితి పూజా కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.

కమీషన్లకు కక్కుర్తి పడి బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం, దాంతో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరవడం వంటి పనులు చేస్తున్నారని జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. దశలవారీ మద్యపాన నిషేధం అంటూ ప్రజలను జగన్ మోసం చేశారని, ధరల పెంపుతో పాటు నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం వ్యాపారంలో ఇప్పటికే రూ.25 వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.

రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, రెండేళ్లలో ఎక్కడా ఒక్క రోడ్డు వేయలేదని చంద్రబాబు ఆరోపించారు. రోడ్డు సెస్ రూ.1200 కోట్లు ఏమయ్యాయని నిలదీశారు.ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా జగన్ రెడ్డి అండ్ కో లూఠీ కోసమే అప్పులు చేసి టీడీపీపై వైసీపీ నేతలు బురద జల్లుతున్నారని ఎద్దేవా చేశారు. సంక్షేమం కోసం, కరోనా కోసం అప్పులు చేయడం లేదని, కరోనాతో జీవితాలు అతలాకుతలైనా కూడా పన్నుల పెంపు ద్వారా రూ.75 వేల కోట్లు భారాన్ని ప్రజలపై మోపారని ఆరోపించారు.

రూ.2 లక్షల కోట్లు అప్పు తెచ్చారని, ఈ నిధులు లూటీ కాబట్టే అభివృద్ధి లేదని, సంక్షేమ పథకాల్లో కోతలు పెడుతున్నారని మండిపడ్డారు.  చింతమనేని ప్రభాకర్, దియ్యా రామకృష్ణ తదితర నేతల అక్రమ అరెస్ట్ లపై న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామన్నారు. లేని దిశ చట్టాన్ని ఉన్నట్లుగా  ప్రజలను భ్రమింపజేశారని, ప్రభుత్వ డొల్లతనం బయటపడిందని అన్నారు. బాధిత మహిళలకు న్యాయం జరిగేందుకు ఈ నెల 9వ తేదీన నర్సరావుపేటలో నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు.
Tags:    
  • Nara Chandrababu naidu 
  • TDP 
  • Andhrapradesh 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS