మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన చంద్రబాబు
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. టీడీపీ తేలిపోయింది. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తాడిపత్రి, మైదుకూరులో మాత్రమే టీడీపీ గెలిచింది. ఇక ఎక్కడా వైసీపీకి పోటీ ఇవ్వలేదు.
జనసేన సైతం ఇదే అనుభవాన్ని ఎదుర్కోగా.. జనసేనాని పవన్ ‘బెదిరింపులతో వైసీపీ గెలిచిందని’ కామెంట్ చేశాడు. ఈ క్రమంలోనే ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సైతం స్పందించారు.
‘‘తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తల్లారా.. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయం కోసం మీలో ప్రతీ ఒక్కరు కష్టపడ్డారని.. కొన్ని చోట్ల ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారని.. మీ పోరాట స్ఫూర్తికి వందనాలు’’ అంటూ చంద్రబాబు తన నేతల పోరాటాన్ని కొనియాడారు.
ప్రస్తుత ఫలితాల విషయానికి వస్తే నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని.. రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం.. ప్రలోభాలు చేసినప్పటికీ గట్టిగా పోరాడామని చంద్రబాబు అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా ముందకు కొనసాగుదామని.. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదేనంటూ చంద్రబాబు పేర్కొన్నారు.