అన్ని తిట్టి ఆయనతో చంద్రబాబు ఒప్పందమా?

Update: 2019-06-14 11:46 GMT
'బిహారీ డెకాయిట్' అన్నారు.. 'గజదొంగ..' అంటూ విరుచుకుపడ్డారు. 'కుల రాజకీయం చేస్తున్నాడు..'అంటూ విమర్శించారు. ఇలా అనేక రకాలుగా ప్రశాంత్ కిషోర్ ను  విమర్శించారు  తెలుగుదేశం వాళ్లు. స్వయంగా చంద్రబాబు నాయుడే పీకేని ఆ మాటలన్నీ అన్నారు. ఒకసారి అని వదిలేయలేదు.  ప్రతిసారీ చంద్రబాబు నాయుడు ఆ మాటలన్నారు.

దాంతో ఆ మాటలపై పీకే కూడా రియాక్ట్ అయ్యాడు. చంద్రబాబుకు  సమాధానం ఇచ్చాడు. అయినా చంద్రబాబు అభిమానులు, తెలుగుదేశం వీరాభిమానులు పీకేని  విమర్శించడం ఆపలేదు. పీకే సర్వేలు అన్నీ బోగస్ అంటూ.. బిహారీ గజ దొంగ.. అంటూ ఆయనను నిందించారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ల నిందలు కొనసాగాయి పీకే విషయంలో!

అలాంటి రాజకీయం అంతా జరిగి ఇరవై రోజులు అవుతున్నట్టుగానే ఇప్పుడు మరో రూమర్ వినిపిస్తూ ఉంది. పీకేతో చంద్రబాబు నాయుడే ఒప్పందం కుదుర్చుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల స్ట్రాటజీల కోసం పీకేతో చంద్రబాబు నాయుడు ఒప్పందం చేసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇవి కేవలం రూమర్లు మాత్రమే.

నేషనల్ మీడియాకు సంబంధించిన ఎవరో ట్వీట్ చేశారని తెలుగు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇంత త్వరగా పీకేతో ఒప్పందాలు కుదుర్చుకోవడం కూడా అంత మెరుగైన ఆలోచన ఏమీ కాదు. ఎన్నికలు పూర్తి అయ్యి నెల కూడా గడవక ముందే చంద్రబాబు నాయుడు ఇంత శరవేగంగా చర్యలు తీసుకోకపోవచ్చు.

అయితే తను నిందించిన పీకేతోనే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకుంటున్నారని ఒక గాసిప్ అయితే షికారు చేస్తూ ఉంది. ఇది ఎంత వరకూ నిజం అవుతుందో.. దీనిపై టీడీపీ, పీకే టీమ్ లు ఎలా స్పందిస్తాయో!



Tags:    

Similar News