బాబుకు భయంగా మారిన ఓవర్ కాన్ఫిడెన్స్!
కొన్ని సినిమాలు క్లాప్ కొట్టిన రోజు నుంచి విపరీతమైన ప్రచారం లభిస్తుంది. అంతకంతకూ పెరిగే ప్రచారంతో ఆ సినిమా మీద భారీ అంచనాలు వ్యక్తమవుతాయి. ఇంతా చేస్తే.. సినిమా విడుదలయ్యాక మాత్రం తుస్ అంటుంది. ఇప్పుడు ఏపీ అధికారపక్ష రాజకీయాలు కూడా ఇదే తీరులో ఉంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నంద్యాల ఉప ఎన్నికకు ముందు ప్రతి తెలుగుదేశం పార్టీకి చెందిన నేత లైట్ తీసుకునే వారు.. క్లీన్ స్వీప్ చేసి పారేస్తామని.. కనీసం 50వేల మెజార్టీ తగ్గే అవకావం లేదంటూ బడాయి మాటలు మాట్లాడే పరిస్థితి. నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయి.. అభ్యర్థులు బరిలోకి దిగి.. ప్రచారం జోరందుకున్న నాటి నుంచి తమ్ముళ్లకు షాకులు మీద షాకులు తగిలే పరిస్థితి. నల్లేరుపై నడకలా సాగాల్సిన నంద్యాల ఉప ఎన్నిక తెలుగు తమ్ముళ్లను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. నంద్యాల ఉప ఎన్నిక ఏమో కానీ.. తమ ప్రాణాల మీదకు వచ్చిందే అన్న భావన పలువురునేతల్లో కలిగేలా చేసిందనటంలో ఎలాంటి సందేహం లేదు.
చచ్చిచెడి ఎన్ని ప్రయాత్నాలు చేసినా.. నంద్యాల ఉప ఎన్నిక అంతిమ తీర్పు ఎలా ఉంటుందో అర్థం కాక తమ్ముళ్లు తెగ టెన్షన్ పడుతున్నారు. ఉప ఎన్నికకు ముందు వారిలో కనిపించిన కాన్ఫిడెన్స్ మాయం కావటమే కాదు.. తుది తీర్పుపై ఇప్పుడు కిందామీదా పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల వ్యవహారం ఇలా ఉంటే.. మరోవైపు జరుగుతున్న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి తెలుగుతమ్ముళ్లు ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. తమ్ముళ్ల నోటి నుంచి వస్తున్న గెలుపు మాటల సంగతి ఇలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి.. పార్టీ అధినేత చంద్రబాబు మాటలు మాత్రం మరోలా ఉన్నాయి. అతి ఆత్మవిశ్వాసం అసలు వద్దని.. అతి విశ్వాసంతో గెలుస్తామని అనుకోవద్దని బాబు చెబుతున్నారు. గెలుస్తామని అనుకోవటం వేరని.. గెలవటం వేరని చెబుతున్న చంద్రబాబు.. తమ్ముళ్లు అంతా ఒళ్లు దగ్గర పెట్టుకొని మరీ గెలుపు కోసం ప్రయత్నించాలని చెప్పటం గమనార్హం.
కేవలం టీడీపీ అభ్యర్థుల గెలుపుతోనే సరిపోదని.. బీజేపీ అభ్యర్థుల గెలుపు గురించి కూడా కృషి చేయాలని కోరటం కనిపిస్తుంది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలో ఉన్న అందరూ అభ్యర్థులు గెలవాలంటూ ఆదేశాలు ఇస్తున్నారు. గెలుపు మీద ధీమాను వ్యక్తం చేస్తూనే.. తమ్ముళ్ల ఓవర్ కాన్ఫిడెన్స్ మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త సందేహాలు వ్యక్తం చేయటం సరికొత్త పరిణామంగా చెబుతున్నారు. ఏమైనా.. ఎన్నికల వేళ.. తమ్ముళ్ల ఓవర్ కాన్ఫిడెన్స్ బాబుకు నిద్ర పట్టకుండా చేస్తుందన్న మాట వినిపిస్తోంది.