అఖిలపక్షాన్ని పంపొచ్చుగా.. పారిశ్రామివేత్తలు ఎందుకు?
విభజన చట్టంలోని హామీల అమలు కోసం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే... ఆ చర్చల్లో పాల్గొన్న ఇద్దరు ఎంపీలు పారిశ్రామికవేత్తలు కావడంతో వారు కేంద్రం వద్ద తమ గళాన్ని ఎంతవరకు వినిపించగలరన్న ప్రశ్న వినిపిస్తోంది. ఏ లొసుగులు - లాలూచీలు లేకుండా కాంట్రాక్టులు - ఆర్థిక అంశాల విషయంలో కేంద్రంతో అసలు సొంత పనులే లేని ఎంపీలైతే గట్టిగా ప్రశ్నించేవీలుంటుందని సూచిస్తున్నారు.
ఏపీకి న్యాయం చేయాల్సిందేనని కోరుతోన్న కేంద్రమంత్రి సుజనా చౌదరి - ఎంపీ సీఎం రమేశ్ ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. నిన్న రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఛాంబర్‌లో నిర్వహించిన భేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం చర్యలు చేపట్టాలని జైట్లీని కోరారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల అమలు విషయంపై ఆయా శాఖల అధికారులతో చర్చిస్తామని జైట్లీ చెప్పినట్లు సమాచారం. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి రూపొందించిన నివేదిక ఎల్లుండి రాబోతోందని జైట్లీ చెప్పారు.
అయితే... ఇలా వ్యాపారాలు - కాంట్రాక్టులు చేసే ఎంపీలతో రాయబారాలు చేయించేకంటే ఏపీ నుంచి అన్ని పార్టీలకు చెందిన సీనియర్ నేతలను కేంద్రం వద్దకు పంపిస్తే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలా చేయడం వల్ల ఇతర పార్టీలు కూడా కలిసొచ్చి పోరాటం మరింత తీవ్రమైతే కేంద్రంపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. అంతేకానీ... పార్టీ ఎంపీలను పంపించినంత మాత్రాన ఫలితం ఉండదని వినిపిస్తోంది. ఇకనైనా సీఎం చంద్రబాబు చొరవ చూపి అన్ని పార్టీలను సంప్రదించి కేంద్రాన్ని కలిసికట్టుగా ఢీకొంటే బెటరన్నఅభిప్రాయం అందరి నుంచి వినిపిస్తోంది. ఏపీకి జరుగుతున్న అన్యాయం నుంచి పొలిటికల్ మైలేజి పొందే ఆలోచనలు కంటే రాష్ఱ్ట ప్రయోజనాలు గురించి ఆలోచిస్తే మంచిది.