పాలన గాడితప్పిందని అంగీకరించిన చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు అంటే దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు. గొప్ప పాలకుడిగా ఆయన్ను మిగతా సీఎంలు కూడా స్ఫూర్తిగా తీసుకున్న సందర్భాలున్నాయి. చంద్రబాబు గత టెర్ములో సీఎంగా ఉన్నప్పుడే మధ్య ప్రదేశ్ లో సీఎంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తరచూ చంద్రబాబును పొగిడేవారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు - ఇతరపార్టీల నేతలు చాలామంది చంద్రబాబును మంచి పాలకుడిగా చెబుతుంటారు. అలాంటి చంద్రబాబే స్వయంగా తన పాలన గాడితప్పిందని అంటే మన చెవులను మనమే నమ్మలేం.. కానీ, సోమవారం మంత్రులతో సమావేశం సందర్భంగా చంద్రబాబు అలా అనేసరికి మంత్రులంతా ఆశ్చర్యపోయారట.
సోమవారం ఉదయం మంత్రులతో జరిగిన సమావేశంలో పలువురు మంత్రులు తమ మనసులో మాటలను చంద్రబాబు ముందుంచారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ప్రజలు అనుకుంటున్నారని... సీఎం దాన్ని అడ్డుకోలేకపోతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారని వారు చంద్రబాబుతో చెప్పారు. ఆ మాట చెప్పేటప్పుడు చంద్రబాబు ఏమంటారో అని వారు కాస్త ఆందోళన చెందినా... చంద్రబాబు మాత్రం 'అవును' అంటూ వారి అభిప్రాయంతో ఏకీభవించారట.
అయితే...పాలన కొంత గాడితప్పిందన్న వాస్తవాన్ని అంగీకరించిన ఆయన ఆ తరువాత ''జూన్ తరువాత పాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను" అని వారితో అన్నారట. ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానికి రావాల్సిందేనని... అందులో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన గట్టిగా చెప్పారట.