బాబు గారి తెనాలి సభ అట్టర్ ప్లాప్ అంటగా !

Update: 2020-02-05 09:30 GMT
టీడీపీ అధినేత , ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉంది. 2019 ఎన్నికలలో టీడీపీ ..పార్టీ హిస్టరీ లో లేని విదంగా లేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకోవడంతో కొన్ని రోజులపాటు మౌనంగా ఉన్నారు. అలాగే తనయుడు లోకేష్ కూడా ఓడిపోవడం బాబు గారిని మరింత అవమాన కరం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చాలా గొప్పగా పదే పదే చెప్పుకునే బాబు కనీసం కొడుకుని కూడా గెలిపించుకోలేకపోయాడు అనే మచ్చ అలాగే మిగిపోనుంది.

ఇక పొతే , ఆ తరువాత వైసీపీ ని ఇరుకున పెట్టాలని చాలా సందర్భాలలో ప్రయత్నం చేసినప్పటికీ కూడా వైసీపీ సర్కార్ ఎన్నికల హామీలతో పాటుగా , ఎన్నికల సమయంలో ఇవ్వని హామీలని సైతం నిరవేర్చుతూ పాలన సాగిస్తుండటంతో టీడీపీ నేతలతో పాటుగా అధినేత కూడా దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. పైకి వైసీపీ ప్రభుత్వం పై పోరాడుతున్నాం ...మా పోరాటం ఆగదు అని చెప్తున్నప్పటికీ ..వచ్చే ఎన్నికల సమయానికి అసలు టీడీపీ అనేది ఉంటుందో లేదో కూడా అనుమానంగానే ఉంది. టీడీపీ లో బాబు తరువాత ఆ రేంజ్ లో ప్రభుత్వం పై విరుచుకుపడే నాయకుడే కరువైయ్యారు.

ఇదే సమయంలో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి జరగాలని , అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ ..మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకోని వస్తే ..రాజధాని అమరావతి నుండి తరలిపోతే ..తమ పార్టీ వారి భూములు , తమ బినామీల భూముల విలువ ఎక్కడ తగ్గిపోతుందో అని అమరావతిలోని రాజధాని అంటూ అమరావతి ప్రాంత రైతులని రెచ్చగొట్టే వారితో ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి నుండి రాజధానిని తరలించడం లేదు ..దానితో పాటుగా మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తాం అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా పార్టీ స్టాండ్ మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యం లో టీడీపీ రాజధాని పేరుతొ చేసే మోసం మరోసారి బయట పడింది.

అమరావతి జేఏసీ పేరిట తెనాలిలో టీడీపీ నిర్వహించిన సభ జనం లేక వెలెవెలపోయింది. ఈ సభకు 20 వేల మందిని సమీకరించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశించినప్పటికీ.. కేవలం 2వేల మంది కూడా సభకి హాజరుకాలేదు. జనం లేకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరపాల్సిన సభను.. చివరకు రాత్రి 8 గంటల సమయంలో ప్రారంభించినప్పటికీ జనం మాత్రం రాలేదు.అలాగే వచ్చిన వారిలో చాలామంది మధ్యలోనే వెళ్లిపోయారు. ఇదే సమయంలో చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కూడా ఎవరు పెద్దగా పట్టించుకో లేదు. దీంతో చంద్రబాబు తన బాధను ఖాళీ కుర్చీలకే చెప్పుకున్నారు. మొత్తంగా తెనాలి లో నిర్వహించిన ఈ సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. దీనిపై చంద్రబాబు జిల్లా టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. మొత్తంగా ఈ ఘటన తో అమరావతి పేరిట రాద్ధాంతం చేస్తున్న బాబు కి దిమ్మతిరిగి పోయింటుంది.



Tags:    

Similar News