కేసీఆర్ అంటే ఎందుకంత భయం బాబూ?
చంద్రబాబూ.. నేను మూడో కన్ను తెరిస్తే నీ గతేం కాను?
చంద్రబాబు ఆంధ్రా రాక్షసి
అడుక్కుంటే నేనే నాలుగు సీట్లు పడేసేవాణ్ని కదా..
తెలుగుదేశం పార్టీ అధినేత - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి తెలంగాణ ఆపద్ధర్మ సీఎం - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలివి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ కేసీఆర్ స్వరం పెంచుతున్నారు. కాంగ్రెస్‌తోపాటు టీడీపీపై పరుష పదజాలం ఉపయోగిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. పొరుగు రాష్ట్ర సీఎంను లెక్కే చేయట్లేదు. అయినప్పటికీ.. చంద్రబాబు నోరు మెదపడం లేదు. కేసీఆర్ తిట్ల దండకాన్ని ప్రతిఘటించడం లేదు. ఆయన స్వయంగా రంగంలోకి దిగడం పక్కన పెట్టండి.. కేసీఆర్ ను ప్రశ్నిస్తున్న తన పార్టీ నేతలనూ చంద్రబాబు వారిస్తున్నారు. ఎదురుదాడి చేయొద్దని వారిని హెచ్చరిస్తున్నారు.
ఎందుకిలా? కేసీఆర్ పై బాబు ఎందుకింత మెతకగా వ్యవహరిస్తున్నారు? ఈ ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న సమాధానం.. బాబు భయపడుతున్నారు. అవును. కేసీఆర్ ను చూసి చంద్రబాబు భయపడుతున్నారట. అందుకే ఎదురుదాడికి దిగకుండా తన పార్టీ నేతలను వారిస్తున్నారట. వాస్తవానికి కేసీఆర్ విమర్శలపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో పలువురు టీడీపీ నేతలు తొలుత ఘాటుగా స్పందించారు. కర్నూలు దేశం నేత బంగి అనంతయ్య అయితే.. ఏకంగా కేసీఆర్ చిత్రపటాన్ని చెప్పుతో కొడుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అయితే, ఈ నిరసనను చంద్రబాబు తప్పుపట్టారు. అనంతయ్యను హెచ్చరించారు. ఇతర నేతలెవరూ అలాంటి ప్రదర్శనలు నిర్వహించొద్దని.. సంయమనం పాటించాలని హుకుం జారీ చేశారు. మాటకు మాట అంటే కేసీఆర్ కు మనకు తేడా ఏముందంటూ పార్టీ వర్గాలను ప్రశ్నించారు కూడా.
చంద్రబాబు భయానికి ఓటుకు నోటు కేసే ముఖ్య కారణమన్నది పలువురి వాదన. రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాల్లోనూ ప్రధానంగా ఓటుకు నోటు కేసులో దొరికిన రూ.50 లక్షల గురించే అధికారులు ప్రశ్నించినట్లు ఇప్పటికే తేలిపోయింది. ఆ కేసు ఇంకా ముగియలేదు కాబట్టి చంద్రబాబు జుట్టు కేసీఆర్ చేతిలో ఉన్నట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, కేసీఆర్ కు కేంద్ర ప్రభుత్వ అండ కూడా ఉన్న సంగతిని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు పేరు చెప్తేనే ప్రధాని నరేంద్ర మోదీ - కమలనాథుల అధ్యక్షుడు అమిత్ షా మండిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎదురుదాడికి దిగితే.. కేంద్రంలోని పెద్దల అండతో కేసీఆర్ మరింత బరితెగించే అవకాశముందని బాబు జంకుతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. అందుకే తాను మాట మాట్లాడకుండా ఉండటంతోపాటు పార్టీలోని ఇతరుల నోటికీ ఆయన తాళం వేస్తున్నట్లు తెలుస్తోంది.