కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇయ్యాల్సిందేనంటున్న బాబు
టీఆర్ఎస్ తో దోస్తీ కటీఫ్ చేసుకొని కాంగ్రెస్ తో జతకట్టిన టీడీపీ బొక్కబోర్లాపడింది. ఇప్పుడు ఓడిపోయాక మీనమేశాలు లెక్కిస్తోంది. టీఆర్ఎస్ కాలదన్నడంతోనే తాము కాంగ్రెస్ కు దగ్గరయ్యామని కట్టుకథలు చెబుతోంది. టీఆర్ఎస్ ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ కు వ్యతిరేకమంటూ బుకాయిస్తోంది. నిజానికి హరికృష్ణ మృతదేహం సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబు.. కేటీఆర్ తో పొత్తులకు అర్రులు చాచాడు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆరే సెలవిచ్చాడు.
2014లో కలిసి పోటీచేసిన బీజేపీ-టీడీపీ ధ్వయం ఏపీకి ఏదో చేస్తామని ఉద్దరించింది. అనంతరం బీజేపీతో అంటకాగిన చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని కాదు అంటూ నిస్సిగ్గుగా ప్రకటించారు. అనంతరం తన స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీతో తెగతెంపులు చేసుకొని ప్రత్యేకహోదా కోసం పోరుబాట పట్టారు. అంతకుముందు హోదా కోసం నినదించిన వైఎస్ జగన్ ను ఇదే చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
జగన్ నే కాదు.. హోదా కోసం నిలదీసిన పవన్ ను కూడా చంద్రబాబు తిట్టిపోశారు. హోదా విషయంలో చంద్రబాబు ఊసరి వెళ్లిలా రంగులు మార్చి తన స్వార్థం కోసం ఎన్నో నాటకాలాడారు.
తనకు అందివచ్చిన ఏ రాజకీయావకాశాన్ని వదలిపెట్టని చంద్రబాబు తాజాగా టీఆర్ఎస్ ఏపీ రాజకీయాల్లో వేలుపెడతానని ప్రకటించడంతో కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్ లో తాము నిలదీస్తే టీఆర్ఎస్ అడ్డుపడిందని.. టీఆర్ఎస్ ను కార్నర్ చేసే పనిలో పడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రిటర్న్ గిఫ్ట్ కు భయపడుతున్న టీడీపీ నేతలు తాజాగా టీఆర్ఎస్, వైసీపీ, జనసేనలను కలుపుతూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రెడీ అయ్యారు. కేసీఆర్ గిఫ్ట్ ఇస్తారో లేదో కానీ.. మన చంద్రబాబు మాత్రం కేసీఆర్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే.. దాన్ని క్యాష్ చేసుకొని తాను రాజకీయంగా లబ్ధి చెందాల్సిందేనన్న కృతనిశ్చయంతో క్షుద్రరాజకీయాలకు తెరతీశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.