వ‌ర్క‌వుట్ చేయాలేమో 'సేనాని' గారూ!

ఈ మాట అంటున్న‌ది ఆయ‌న‌ను వ్య‌తిరేకిస్తున్న‌వారో.. లేక‌.. ఆయ‌న ప్ర‌త్య‌ర్థులో కారు.. క‌ర‌డు గ‌ట్టిన జ‌న‌సేన అభిమానులే.

Update: 2026-06-10 07:20 GMT

రాజ‌కీయాల్లో ఎంతో మంది నాయ‌కులు ఉన్నారు. ఎన్నో పార్టీలు కూడా ఉన్నాయి. కానీ.. జ‌న‌సేన పాత్ర ప్ర‌త్యేకం. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు ఉన్న ఇమేజ్ మ‌రింత ప్ర‌త్యేకం. ఈ ప్ర‌త్యేక‌త‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం.. బాధ్య‌త కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్‌పైనే ఉంది. లేక‌పోతే.. ఎంత ఇమేజ్ ఉన్నా.. అది బెడిసి కొడుతుంది. ఈ మాట అంటున్న‌ది ఆయ‌న‌ను వ్య‌తిరేకిస్తున్న‌వారో.. లేక‌.. ఆయ‌న ప్ర‌త్య‌ర్థులో కారు.. క‌ర‌డు గ‌ట్టిన జ‌న‌సేన అభిమానులే. ఒక్కొక్క సంద‌ర్భంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్క‌వుట్ చేయ‌కుండా.. చేస్తున్న వ్యాఖ్య‌లు బూమ‌'రాంగ్‌' అవుతున్నాయి.

వీటిని లైట్ తీసుకుంటే.. ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు. విప‌క్షాలు.. లేదా తానంటే గిట్ట‌నివారు ఆరోపిస్తున్నార‌ని అనుకున్నా.. ఏం చేయ‌లేం. కానీ, వాస్త‌వాల‌ను మాత్రం ఎవ‌రూ విస్మ‌రించ‌లేరు క‌దా!. సీఎంగా చంద్ర‌బాబుకు ఉండే ఇమేజ్ వేరు. కానీ, జ‌న‌సేనానిగా.. ఉప ముఖ్య‌మంత్రిగా ప‌వ‌న్‌కు ఉన్న ఇమేజ్ వేరు. ప‌వ‌న్ అంటే.. అన్నీ తెలుసుకుని మాట్లాడ‌తార‌ని.. అన్నీ అధ్య‌య‌నం చేసే మాట్లాడ‌తార‌న్న పేరుంది. ఆయ‌నకు రాజ‌కీయంగా అనుభ‌వం పుష్క‌ర‌కాల‌మే అయినా.. చ‌దివిన పుస్త‌కాలు.. చూసిన అనుభ‌వం వంటివి ఇమేజ్ పెంచాయి.

కానీ.. తాజాగా విశాఖ‌ ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు.. ఆయ‌న‌కు ఇబ్బందిక‌రంగా మారాయి. బూమ‌'రాంగ్‌' కూడా అయ్యాయ‌ని నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. విష‌యంపై కొంత అధ్య‌య నం చేసి ఉండాల‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. విశాఖ‌స్టీల్ ప్లాంట్ లో జ‌రిగిన ప్ర‌మాదం.. అనంత‌రం.. బాధితుల‌ను పరామ‌ర్శించేందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్లారు. బాధితుల్లో భ‌రోసా నింపారు. అయితే.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసి ఓ వ్యాఖ్య ఇప్పుడు ఆయ‌న‌కు ఇబ్బందిగా మారింది.

'' స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయాల‌ని వైసీపీ ప్ర‌భుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కానీ, మేం దానిని నిలిపివేయించాం.'' అని ప‌వ‌న్ అన్నారు. మ‌రి ఆయ‌న తెలిసి అన్నారో.. లేక కావాల‌నే అన్నారో తెలియదు కానీ.. ఇది తీవ్ర విమ‌ర్శ‌ల‌కు వాస్త‌వ విరుద్ధానికి కూడా దారితీసింది. ప్ర‌స్తుత కేంద్ర మంత్రి కుమార‌స్వా మి.. గ‌త ఏడాది మీడియాతో మాట్లాడిన‌.. మాట‌లు..ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ప‌వ‌న్ తాజా వ్యాఖ్య‌ల‌పై వైసీపీ ఏమంద‌నేది ప‌క్క‌న పెట్టి.. కూట‌మి నాయ‌కుడు, కేంద్ర మంత్రి కుమార స్వామి విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలిస్తే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కొంత వ‌ర్క‌వుట్ చేసి మాట్లాడి ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

కుమార స్వామి ఏమ‌న్నారు..

''దీపం ప‌థ‌కంలో భాగంగా విశాఖ‌ప‌ట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం 2021లో విధాన ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఆ స‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వం(జ‌గ‌న్‌) ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. ప్రైవైటేజ‌న్ చేయ‌డానికి వీల్లేద‌ని.. అవ‌స‌ర‌మైతే.. మీరు(కేంద్రం) చెబుతున్న న‌ష్టాల‌ను భ‌రించేందుకు మేం(ఏపీ ప్ర‌భుత్వం) సిద్ధంగా ఉన్నామ‌ని లేఖ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీనిపై అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా పాస్ చేశారు. దీంతో మా(కేంద్ర‌) నిర్ణ‌యాన్ని స‌మీక్షించాల‌ని నిర్ణ‌యించాం.'' అని కుమార‌స్వామి వ్యాఖ్యానించారు. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు బూమ‌రాంగ్ అయ్యాయి. సో.. ఇక ముందైనా.. ప‌వ‌న్ కొంత వ‌ర్క‌వుట్ చేస్తే బాగుంట‌నేది జ‌న‌సేన నాయ‌కులు సూచిస్తున్న మాట‌.

Tags:    

Similar News