చంద్రబాబు కొంపముంచుతున్న జన్మభూమి కమిటీలు
ప్రభుత్వాన్ని - పార్టీని అనుసంధానించాలన్న ఉద్దేశంతో... ప్రజల్లోకి పార్టీ నేతలు, కార్యకర్తలు వెళ్లాలన్న లక్ష్యంతో చంద్రబాబు చేసిన ప్లానింగ్ బెడిసికొడుతోంది. ప్లాను బెడిసికొడితే కొట్టింది అది ఏకంగా టీడీపీ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికే చెద పట్టిస్తోంది. ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అంటే కేవలం టీడీపీ వాళ్లకే అన్నట్లుగా ఈ కమిటీలు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో టీడీపీయేతర వర్గాలన్నీ పార్టీపట్ల వ్యతిరేకత పెంచుకుంటున్నాయి.
విభజన తరువాత ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజానికి సరైన పథకాలే లేవు. ఆర్థిక పరిస్థితి బాగులేని కారణంగా ప్రజాకర్షక పథకాలకు చంద్రబాబు పథకం ముందుకురాలేకపోయింది. అయితే.. కనీసం మిగతా పథకాలనైనా ఎలాంటి వివక్ష లేకుండా అధికార వర్గాల ద్వారా కొంత వరకు అమలు చేస్తే అన్ని వర్గాల ప్రజలకు అవకాశం దొరికేది. కానీ, జన్మభూమి కమిటీల జోక్యం ఎక్కువైన తరువాత ఆ పరిస్థితి పోయింది. కేవలం కొందరికి మాత్రమే లబ్ధి కలుగుతోంది. ఇది క్షేత్ర స్థాయిలో చంద్రబాబు అన్నా - టీడీపీ అన్నా తీవ్ర వ్యతిరేకత వచ్చేలా చేస్తోంది.
ఇంకో విషయం ఏంటంటే... ఒకవేళ టీడీపీలో వర్గాలుంటే అలాంటి చోట జన్మభూమి కమిటీలో స్థానం లేని నేతల వర్గాలకు న్యాయం జరగడం లేదు. దీంతో సొంత పార్టీలోనూ తీవ్ర అసంతృప్తి ఏర్పడుతోంది. ఇవన్నీ ప్రభుత్వంపైప్రజల్లో నమ్మకం పోయేలా చేస్తున్నాయి. తీవ్ర వ్యతిరేకత పెంచుతున్నాయి.
నూతన రాజధాని ఏర్పాటుకానున్న కీలక జిల్లా గుంటూరునే ఉదాహరణగా తీసుకుంటే... అక్కడ పక్కా గృహాల కోసం దరఖాస్తులు భారీగా వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో 18 వేల గృహాలకు 90 వేలు, పట్టణ ప్రాంతాల్లో 24,576 గృహాలకు 60 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో రిపీటైన దరఖాస్తులు సుమారు 25 వేల వరకు తొలగించారు. మిగిలినవాటిని వీటిని వివిధ రూపాల్లో పరిశీలించి మండల స్థాయి కమిటీ గ్రామాల్లోని జన్మభూమి కమిటీలకు పంపుతుంది. జన్మభూమి కమిటీలు వీటిని స్థానిక ఎమ్మెల్యేల ద్వారా సిఫార్సు చేయిస్తాయి. వీటిని మండల కమిటీలు జిల్లా అధికారులకు సిఫార్సు చేస్తారు. జిల్లా అధికారులు ఆన్ లైన్ లో రాష్ట్ర అధికారులకు సిఫార్సు చేస్తారు. అయితే... జన్మభూమి కమిటీల ద్వారా ఎంపిక ప్రక్రియలో 'మనోడు" అనుకున్నవారికే అవకాశం దక్కుతోందట.
అంతేకాదు... ఇళ్ల నిర్మాణ వ్యయం గతం కంటే భారీగా పెంచి ఇస్తుండడంతో జన్మభూమి కమిటీలు తమ చేతివాటం కూడా చూపిస్తున్నాయి. టీడీపీ వర్గానికి చెందినవారైనా సరే చేయి తడిపితే కానీ అప్లికేషన్లకు ఆమోదం పడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఒక్క గుంటూరే కాదు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో జన్మభూమి కమిటీలు అనగానే గ్రామాల్లో జనం వాటితో పాటు చంద్రబాబును కూడా తిడుతున్నారు.
ఇంతజరుగుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి నేతలెవరూ చంద్రబాబు చెవిన వేయడం లేదు. దీంతో ఇదంతా అద్భుతంగా నడుస్తున్న వ్యవస్థగా ఆయన భావిస్తూ జన్మభూమి కమిటీల గురించి గొప్పగా చెప్పుకొంటున్నారు. చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరిచి క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో అసలు సంగతైనా తెలుసుకోవాలని... లేదంటే వాస్తవ పరిస్థితులు చెప్పేవారినైనా తన చుట్టూ ఉంచుకోవాలి. లేదంటే దెబ్బతినడం ఖాయం.