అవినీతిపార్టీ అని బాబు ఒప్పుకున్నట్టే..!!

Update: 2018-10-22 05:55 GMT
గోబెల్స్ ను మించిన ప్రచారకర్తగా చంద్రబాబుకు రాజకీయాల్లో పేరుంది. అవకాశం వస్తే సొంత మామను అయినా దింపేసి గద్దెనెక్కగల ఓర్పు - నేర్పు ఆయన సొంతమని ప్రతీపక్షాలు ఆడిపోసుకుంటాయి. చరిత్ర కూడా అదే చెబుతోంది కదా.. అందుకే 2014 ఎన్నికల్లో ఓటమి అంచున నిలబడ్డ బాబు మోడీని శరణువేడి.. పవన్ ను బతిమిలాడి మద్దతు తెచ్చుకొని గెలిచాడు. లేకపోతే ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉండేదడనంలో ఎలాంటి సందేహం.. అవసరార్థం రంగులు మార్చడంలో బాబును మించిన ఊసరవెల్లి లేరని తెలుగునాట సెటైర్లు పడుతుంటాయి. ఆయన పొత్తులు ఎత్తులు అధికారం కోసమేననడంలో ఎలాంటి సందేహం లేదంటారు.

చంద్రబాబు అవసరార్థం చేసుకునే విమర్శలను ఆయన లైట్ తీసుకున్నా నెటిజన్లు మాత్రం ఎందుకు వదలుతారు.. ఇప్పుడు ఏకిపారేస్తున్నారు. అప్పుడెప్పుడో దిగ్విజయ్ సింగ్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి.. అది కాంగ్రెస్ పార్టీ డీఎన్ ఏ అని చెప్పుకొచ్చాడు. వైసీపీని దెబ్బకొట్టాలని దిగ్విజయ్ చెప్పిన మాటలు అదే సందర్భంలో ట్వీట్ వేసి చంద్రబాబు దెప్పిపొడిచారు.

‘కాంగ్రెస్ - వైసీపీ ఒకటే డీఎన్ ఏ అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఇది నిజమే.. అవినీతి పార్టీలన్నీ కాంగ్రెస్ లో కలవాల్సిందే.. టీఆర్ ఎస్ కూడా త్వరలోనే కలుస్తుంది’ అని బాబు చేసిన ట్వీట్ సారాంశం. ఇప్పుడా ట్వీట్ ను బయటకు తీసి నెటిజన్లు చంద్రబాబు దుమ్ము దులిపేస్తున్నారు.

చంద్రబాబు అన్న వైసీపీ - టీఆర్ ఎస్ లు కాంగ్రెస్ తో కలవకుండా సొంతంగా ఫైట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ను చీదరించుకున్న టీడీపీ అధినేత మాత్రం అదే అవినీతి పార్టీతో కలిసి ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగుతున్నాడు. దీన్ని బట్టి టీడీపీ అవినీతి పార్టీ అని స్వయంగా బాబు ఒప్పుకున్నట్టేనని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అపర అవినీతి రహిత నేతగా  గొప్పలు చెప్పుకునే బాబు చేసిన ఈ  ట్వీట్ ను షేర్ చేస్తూ అవినీతి పార్టీతో కలిసిన వైనంపై ఇప్పుడు సోషల్ మీడియాలో  నిలదీస్తున్నారు.  
    

Tags:    

Similar News