ఎన్నిసార్లు బాబు; అప్పుడు శాలువా..ఇప్పుడు కార్డు
ఏపీ ముఖ్యమంత్రి పరిస్థితి చిత్రంగా ఉంటుంది. ఏపీ రాజధానిని తాను అనుకున్నట్లే అంగరంగ వైభవంగా నిర్వహించనున్నానన్న సంతోషంలో ఉన్నారో.. లేదంటే.. తాను చేసే పనుల గురించి ప్రచారం మరింత భారీగా జరగాలని భావిస్తున్నారో ఏమో కానీ.. చేసిన పనిని.. చెప్పిన మాటల్ని పదే పదే చెప్పటం కనిపిస్తోంది.
కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి.. ఏపీ రాజధాని శంకుస్థాపనకు సంబంధించిన అంశాలు ఆయనకు చెప్పి.. ఆయన తప్పనిసరిగా రావాలని కోరటం.. అందుకు మోడీ ఓకే చెప్పటం జరిగింది. ఈ సందర్భంగా.. ఏపీ మాస్టర్ ప్లాన్ ను మోడీకి పంపుతానని.. ఒకసారి పరిశీలించి మార్పులు ఏమైనా ఉంటే చెప్పాలని కోరటం గుర్తుండే ఉంటుంది.
అదే రోజు మోడీని శంకుస్థాపనకు ఆహ్వానించిన ఆయన.. తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను సైతం శంకుస్థాపనకు ఆహ్వానించారు. ఇది జరిగిపోయి రెండు వారాలు గడిచిపోయాయి. తాజాగా ఢిల్లీ వచ్చిన చంద్రబాబు ప్రధాని మోడీని మరోసారి కలిశారు. ఈసారి స్వచ్ఛభారత్.. నీతి ఆయోగ్ ఉప సంఘం నివేదికను ప్రధానికి ఇచ్చేందుకు కలిశారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని శంకుస్థాపనకు హాజరు కావాలని ప్రధాని మోడీని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే శాలువా కప్పి మరీ మోడీని శంకుస్థాపనకు పిలిచిన చంద్రబాబు.. తాజాగా కార్డు చేతిలో పెట్టి రావటం జరిగింది. నిజానికి మొదటిసారి ఆహ్వానించటానికి వెళ్లినప్పుడు శాలువా లాంటి హడావుడి అక్కర్లేదు. ఎందుకంటే.. శుభలేఖ వచ్చిన తర్వాత సంప్రదాయం ప్రకారం ఆహ్వానించే వ్యవహారం ఒకటి ఉండనే ఉంటుంది.
ఈ నేపథ్యంలో మొదటిసారి కలిసినప్పుడు శంకుస్థాపన గురించి వివరాలు చెప్పి.. శుభలేఖలు తయారైన తర్వాత ఫార్మల్ గా పిలుస్తానని చెప్పటం తప్పేం కాదు. కానీ.. మొదటిసారే కార్డు లేకుండా శాలువా కప్పేసి హడావుడి చేసిన బాబు ఇప్పుడు కార్డు ఇచ్చి మరోసారి ప్రచారం చేసుకున్నట్లుగా కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. అసలే బాబు.. ఆ పై ప్రచారం మీద ఆయనకున్న విమర్శల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కారణం చేతనే శంకుస్థాపనకు ప్రధానిని పలుమార్లు పిలిచినట్లుగా కనిపించే పరిస్థితి.