చంద్రబాబుకి ఇప్పుడు వెంకీ ఆసన్‌ చాలా అవసరం

Update: 2019-02-20 06:29 GMT
జగన్‌ ఫ్రస్టేషన్‌ లో ఉన్నాడు. అందుకే తమ పార్టీ నేతల్ని ఆయన పార్టీలో చేర్చుకుంటున్నాడు అని రెండు రోజులుగా గగ్గోలు పెడుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. నిజం చెప్పాలంటే.. చంద్రబాబుని చాలా జాగ్రత్తగా గమనిస్తే.. అసలు ఫ్రస్టేషన్‌ లో ఉందని ఆయనే అన్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఓవైపు వైసీపీకి అనుకూలంగా వస్తున్న సర్వేలు - మరోవైపు.. పార్టీ నుంచి వెళ్లిపోతున్న నాయకులతో చంద్రబాబుకు ఏం చెయ్యాలో - ఎలా నివారించాలో అర్థం కావడం లేదు. అందుకే.. తన ఫ్రస్టేషన్‌ ని ఏం మాట్లాడని అధికారుల మీద - ఇంటిలిజెన్స్‌ అఫీసర్స్‌ మీద చూపిస్తున్నారు. బాబు పరిస్థితి చూస్తుంటే.. ఎఫ్‌2 సినిమాలో వెంకీ ఆసన్‌ ఇప్పుడు చాలా అవసరంలా అన్పిస్తుంది. 

నిన్నటికి నిన్న కింగ్ నాగార్జున జగన్‌ ని కలిశారు. నాగార్జున గురించి అందరికి తెలిసిందే. ఆయన అసలు రాజకీయాల్లోకే రాడు. తనకు తెలిసిన వారి సీటు విషయం మాట్లాడేందుకు జగన్‌ ని కలిశారు నాగ్‌. దీంతో.. చంద్రబాబు ఫ్రస్టేషన్‌ బయటకు వచ్చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారితో సినిమా హీరోలు కలవడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ తన అసహనాన్ని - కోపాన్ని బయటకు కక్కేశారు. ఇక నాలుగు రోజులుగా లోటస్‌ పాండ్‌ కు  క్యూ కడుతున్న తమ నాయకుల్ని చూసి చంద్రబాబుకి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. వాళ్లు వెళ్లిపోయినందుకు ఉన్న బాధకన్నా.. మీడియా ముందు వాళ్లు చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబుకి కడుపు మండిపోతుంది. దీంతో.. కాసేపు మోదీని - కాసేపు కేసీఆర్‌ ని - కాసేపు జగన్‌ ని.. ఇలా ఎవ్వరినీ వదలకుండా అందరిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఫ్రస్టేషన్‌ తగ్గాలంటే.. బాబుగారు కూడా వెంకీ ఆసన్‌ ట్రై చేయాల్సిందే.

Tags:    

Similar News