• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జంపింగ్ నేత‌ల తిప్ప‌లు...

జంపింగ్ నేత‌ల తిప్ప‌లు బాబుకు మొద‌ల‌య్యాయి!

By - Tupaki Desk
Update: 2016-10-09 07:09 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని త‌ల‌నొప్పి ఎదుర‌వుతోంది. పార్టీల బలోపేతం కోసం అంటూ ఇత‌ర పార్టీల నేత‌లను చేర్చుకున్న స‌మ‌యంలో ప్రారంభ‌మైన అస‌మ్మ‌తి నామినేటెడ్ పదవుల కేటాయింపుతో చిచ్చు రేగింది. తాజాగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ తో పాటు మ‌రోనేత‌కు ప‌ద‌వులు ఇవ్వ‌డంపై రాజ‌ధాని ప్రాంత‌మైన గుంటూరులో త‌మ్ముళ్లు ర‌గిలిపోతున్నార‌ని అంటున్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిన తరువాత నామినేటెడ్‌ పదవుల భ‌ర్తీ జోరందుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే  ఎప్పటినుంచో టీడీపీని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్‌ నాయకులను విస్మరించి కొత్తగా పార్టీలోకి చేరినవారికి పదవులు కట్టబెట్టడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో రగిలిపోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ నుంచి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పార్టీలో చేరిన ఎం.డి.హిదాయత్ - పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ లకు చైర్మన్‌ పోస్టులు కట్టబెట్టడంపై పార్టీ సీనియర్‌ నాయకులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా పదవులు అనుభవించి.. టీడీపీపై - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అప్పటి మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ కు పదవి కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ పదేళ్లు అధికారంలో లేకపోయినా కార్యకర్తలకు అండగా ఉంటూ కష్టపడి పనిచేసిన మాజీ మంత్రి జె.ఆర్‌.పుష్పరాజ్‌ కు మాత్రం మొండిచెయ్యి చూపారంటూ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి. రాజ్యసభ - ఎమ్మెల్సీ - ఇలా అనేక పదవులు కేటాయించే సమయంలో పుష్పరాజ్‌ పేరును తెరపైకి తేవడం, చివరి నిమిషంలో పక్కనపెట్టడం పరిపాటిగా మారిందని ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గతంలో పలు సంఘాలు సమావేశాలు పెట్టి పుష్పరాజ్‌ కు పదవులు కేటాయించకపోవడంపై తీవ్ర విమర్శలు  చేసిన విషయం తెలిసిందే.

పార్టీలో మొదటి నుంచి పనిచేసిన మాజీ మంత్రులు పుష్పరాజ్ - శనక్కాయల అరుణలతో పాటు జియావుద్దీన్ - దాసరి రాజా మాస్టారు - చందు సాంబశివరావు - వెన్నా సాంబశివారెడ్డి - ఇలా చెప్పుకొంటూపోతే అనేకమంది సీనియర్‌ టీడీపీ నేతలు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదవుల కోసం ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. వారిని కనీస పరిగణనలోకి తీసుకోని పార్టీ అధిష్టానం - జిల్లా మంత్రులు... ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు - తమకు తొత్తులుగా వ్యవహరించే అనుయాయులకు పదవులు కట్టబెట్టుకుంటున్నారని పార్టీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినా పదుల సంఖ్యలో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు సైతం ఎటువంటి మేలూ జరగలేదనే అసంతృప్తి ఉంది. ఎన్నికల సమయంలో మాత్రం తమ చుట్టూ తిరిగి పనిచేయించుకున్న ఎమ్మెల్యేలు - మంత్రులు పదవుల విషయానికొచ్చేసరికి కనీసం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఇటీవల జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశాల్లో సైతం టీడీపీ సీనియర్‌ నాయకులు - కార్యకర్తలు పదవుల విషయంలో తమకు అన్యాయం జరిగితే పార్టీ కార్యాలయాన్ని బద్దలు కొడతామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేసినా దాన్ని పెడచెవిన పెట్టేశారు. ఇటీవల ప్రకటించిన గుంటూరు మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ పోస్టుల్లో సైతం పార్టీ కోసం పనిచేయని వారికి పదవులు కట్టబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనిచేసేవారిని పక్కన పెట్టి పైరవీకారులకు పదవులు కట్టబెట్టి పార్టీకి ద్రోహం చేస్తున్నారని మండిపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిదులు నామినేటెడ్‌ పదవులను అమ్ముకుంటున్నారంటూ పార్టీలోని సీనియర్‌ నాయకులు - కార్యకర్తలు తీవ్ర ఆరోపణలు గుప్పించడం చూస్తుంటే టీడీపీలో అంతర్గత పోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

త్వరలో కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీలో రేగిన పదవుల కుంపటి ఏ అనర్థాన్ని తెచ్చి పెడుతుందోనని టీడీపీ కార్యకర్తలు మధనపడుతున్నారు. ఇలాగైతే కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటమి తప్పదంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Chandrababu Naidu 
  • Jumping Leaders 
  • Telugu NEws 

Similar News

అల్లూరులో చేతులు కలిపిన టీడీపీ, వైసీపీ.. రెండో విడత మున్సిపోల్స్ లో ఆసక్తికర పరిణామం

2026-11-15 09:45 GMT

యూపీలో యోగి కోసం ఒవైసీ.. ఉత్తరాది రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్

2026-11-15 09:41 GMT

సామాన్యుడికి బిగ్ రిలీఫ్: బియ్యం కొత్త ధరలు ఫిక్స్.. ఒక్క రూపాయి ఎక్కువ అమ్మితే అంతే!

2026-11-15 09:37 GMT

త‌నిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబ‌ర్ అరెస్ట్!

2026-11-15 07:33 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

రాప్తాడు కేసులో బిగ్ అప్డేట్: బాలిక ఆరోగ్యం 75% రికవరీ

2026-11-15 07:31 GMT

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

Copyright @2026

Powered by Blink CMS