హోదా మీద మాట్లాడినప్పుడు అది తెలీదా బాబు?
దేశంలో తానంత రాజకీయ అనుభవం ఉన్న నేత మరొకరు లేరని గొప్పలు చెప్పుకోవటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటన్న విమర్శ ఉంది. అందుకు తగ్గట్లే.. తన కీర్తిని తానే కీర్తించుకునే చంద్రబాబు.. విశాఖలో నిర్వహించిన రెండు రోజుల భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఆయన చాలా ఉత్సాహంగా కనిపించారు. సదస్సుకు ముందే రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటమే తమ ధ్యేయమని చెప్పిన చంద్రబాబు.. అంతకు మించిన అన్నట్లుగా రూ.10.5లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షిస్తూ.. వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవటం తెలిసిందే.
అదేం చిత్రమో కానీ.. బాబు పిలవాలే కానీ.. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి క్యూ కడుతుంటారు. అలా క్యూ కట్టిన వారంతా పెట్టుబడులు పెట్టి.. కంపెనీలు పెట్టటం లాంటివి చేసినా చేయకున్నా.. కాగితాల మీద ఒప్పందాల్ని మాత్రం భారీగా చేసుకోవటం కనిపిస్తుంది.
ఇలా మాటలతోనే అభివృద్ధిని కళ్లకుకట్టినట్లుగా చూపించే చంద్రబాబు టాలెంట్ ఇలాంటి వాటి విషయాలకే పరిమితం కాదు. ప్రత్యేక హోదా అవసరం రాష్ట్రానికి చాలా అవసరం అంటూ.. మొన్నటి వరకూ చెప్పిన చంద్రబాబు.. ప్రత్యేక ప్యాకేజీ తెర మీదకు తీసుకొచ్చి.. హోదా గురించి మాట్లాడటమే మానేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి.. హోదా ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి ఏ విధంగా జరిగిందో అక్కడికి వెళ్లి చూస్తే.. అర్థమవుతుందని చెబుతున్నారు.
ప్రత్యేక హోదా వల్ల ఏం కాదన్న మాటను పదే పదే బాబు నోటి వెంట ఈ మధ్యన వినిపిస్తుంది. ఒకవేళ.. అదే నిజమైతే.. దేశంలోనే సీనియర్ రాజకీయ నేత అయిన చంద్రబాబుకు.. హోదా వల్ల ఏమీ కాదనప్పుడు.. దాని గురించి గతంలో ఎందుకు మాట్లాడినట్లు? ఎన్నికల ప్రచారంలో ఆ అంశాన్ని ప్రముఖంగా ఎందుకు ప్రస్తావించినట్లు? ప్రచారానికి రాష్ట్రానికి వచ్చిన నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ చేత హామీ ఎందుకు ఇప్పించినట్లు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. హోదా మీద తన మాటను పూర్తిగా మార్చేసిన చంద్రబాబు.. హోదా ఉన్న రాష్ట్రాల్లో ఏమీ జరగలేదన్న మాటను చెబుతున్నా ఆయన.. ఒకవేళ తన వాదనే నిజమని అనుకుంటే.. ఆ విషయంలో వాస్తవం ఎంతన్నది తేల్చటానికి అఖిలపక్షాన్ని ఒకటి ఏర్పాటు చేసి.. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి ఎంతన్నది అధ్యయనం కోసం పంపిస్తే సరిపోతుంది? మరి.. ఆ ధైర్యం చంద్రబాబులో ఉందా? ఉత్తి మాటలు చెప్పే కన్నా.. అందరికి అర్థమయ్యేలా చేయొచ్చుగా? ఆయన చెప్పిందే నిజమైతే.. హోదా కోసం పోరాడే వారు సైతం.. బాబును సమర్థిస్తారు కదా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/