మార్నింగ్ నుంచి చంద్రబాబులో ఎలక్షన్ టెన్షన్

Update: 2017-07-17 08:55 GMT
రాష్ర్టపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఇంతకుముందెన్నడూ లేనట్లుగా తెగ టెన్షన్ పడుతున్నారట. తమ పార్టీ ఎమ్మెల్యేలు పొరపాటున ఏదైనా తప్పు చేసి సరిగా ఓటేయకపోతే పరువుపోతుందన్నది ఆయన టెన్షన్ గా తెలుస్తోంది. అదేసమయంలో ఇటీవల కాలంలో పార్టీ నేతల్లో నిర్లక్ష్యం కూడా ఎక్కువవడంతో ఎవరైనా ఓటేయడానికి రాకపోతే డేంజరని ఆయన టెన్షన్ పడుతున్నారట. దీంతో పొద్దున్నుంచి ఆయన ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారని సమాచారం.
    
ఇంకా ఓటేయడానికి రాని ఎమ్మెల్యేలపై ఆయన సీరియస్ అవుతున్నారట.  కొందరిని తానే స్వయంగా ఫోన్ చేసి సమయపాలన పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే ఎలాగంటూ సీనియర్ల వద్ద కూడా ఆవేదన వ్యక్తం చేసి అందరికీ ఫోన్లు చేసి వెంటనే పిలిపించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
    
జిల్లాల వారీగా ఎమ్మెల్యేల లెక్క చూసుకోవాలని పార్టీ సీనియర్లకు ప్రత్యేకంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఒక్క ఎమ్మెల్యే కూడా మిస్ కాకూడదని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారని.. దీంతో ఎక్కడెక్కడున్న ఎమ్మెల్యేలంతా హుటాహుటిన అమరావతికి ప్రయాణం కడుతున్నారు.
    
అయితే.. ఏపీలో విపక్ష వైసీపీ కూడా ఎన్డీయే అభ్యర్థికే మద్దతు పలకడంతో వారు అందరూ వేసి.. తమ పార్టీ వారు ఎవరైనా మిస్ అయితే పరువు పోతుందని చంద్రబాబు కొందరు ముఖ్య నేతల వద్ద అన్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News