దేశం సిట్టింగ్ ల ప‌క్క చూపు!

Update: 2018-12-23 08:39 GMT
తెలుగుదేశం పార్టీలో వ‌ల‌స‌లు ఊపందుకోనున్నాయి. జ‌న‌వ‌రి నెలాఖ‌రు నాటికి అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టిస్తాన‌ని తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించ‌డంతో సిట్టింగుల గుండెల్లో గుబులు ప్రారంభ‌మైంది. దీనికి తీడు తెలుగుదేశం పార్టీ సిట్టింగులు - మంత్రుల‌కు ర్యాంకులు ప్ర‌క‌టించ‌డం కూడా పార్టీలో చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ర్యాంకుల పేరుతో కొంద‌రు సిట్టింగుల‌కు టిక్క‌ట్లు ఇవ్వ‌కుండా చేయాల‌న్న‌ది చంద్ర‌బాబు నాయుడి ఎత్తుగ‌డ‌గా చెబుతున్నారు. దీంతో ప్ర‌స్తుత‌మున్న సిట్టింగ్ శాస‌న‌స‌భ్యుల్లో స‌గానికి పైగా టిక్క‌ట్లు ద‌క్క‌క‌పోవ‌చ్చునంటున్నారు. మంత్రివ‌ర్గ స‌మావేశంలోను - పార్టీ సీనియ‌ర్ల‌తో జ‌రిపిన స‌మావేశాల్లోనూ కూడా సిట్టింగుల‌కు టిక్క‌ట్లు ఇచ్చే ఉద్దేశ్యం లేద‌న్న‌ట్లుగా చంద్ర‌బాబు నాయుడు చెబుతున్నారు. దీంతో ఈసారి టిక్క‌ట్లు క‌చ్చితంగా రావ‌ని ఖ‌రారైపోయిన కొంద‌రు శాస‌న‌స‌భ్యులు పార్టీ  మారాల‌ని యోచిస్తున్న‌ట్లు చెబుతున్నారు. కొంద‌రు ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ జ‌న‌సేన‌లో చేరాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే, చాలామంది తెలుగుదేశం శాస‌న‌స‌భ్యులు మాత్రం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాల‌నుకుంటున్న‌ట్లు చెబుతున్నారు.

రానున్న ఎన్నిక‌ల్లో త‌మ‌కు టిక్క‌ట్లు రావ‌ని క‌చ్చితంగా నిర్ణ‌యం అయిపోయిన తెలుగుదేశం సిట్టింగులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయ‌కుల‌తో చ‌ర్చిస్తున్న‌ట్లు చెబుతున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో టిక్క‌ట్లు హామీ ఇచ్చేది లేద‌ని - పార్టీ అధికారంలోకి వ‌స్తే మాత్రం మంచి ప‌ద‌వులు ఇస్తామ‌ని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అధిష్టానం చెబుతున్న‌ట్లు స‌మాచారం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇప్ప‌టికే త‌మ‌కు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అభ్య‌ర్ధులున్నార‌ని - వారిని మార్చి కొత్త‌గా పార్టీలోకి వ‌చ్చే వారికి  టిక్క‌ట్లు ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని అంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు మాత్రం తెలుగు త‌మ్ముళ్లు ఎంత మంది వ‌స్తే అంద‌రినీ పార్టీలోకి తీసుకోవాల‌న్న‌ది వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల ఆలోచ‌న‌గా చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో అన్ని విభాగాల‌కు చెందిన నాయ‌కులు అసంత్ర‌ప్తితోనే ఉన్నార‌ని, చంద్ర‌బాబు నాయుడి ఒంటెత్తు పోక‌డ‌ల‌తో వారంతా విసిగిపోయార‌ని అంటున్నారు. దీంతో జ‌న‌వ‌రి నెలాఖ‌రులో పార్టీ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌గానే తెలుగుదేశం పార్టీ నుంచి భారీ స్ధాయిలో వ‌ల‌స‌లు ఉంటాయ‌ని అంచ‌నా చేస్తున్నారు. ఇదే విష‌యాన్ని పార్టీ అధ్య‌క్షుడు వై.ఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ద్ద కూడా ప్ర‌స్తావించిన‌ట్లు చెబుతున్నారు. జ‌న‌వ‌రి నెల‌లో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌గానే వ‌ల‌స‌లు ఊపందుకుంటాయ‌ని చెబుతున్నారు. 

Tags:    

Similar News