ఇద్ద‌రు చంద్రుల గురించి కొత్త చ‌ర్చ ఇది

Update: 2017-05-08 05:04 GMT
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌ రావు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విష‌యంలో ఒక‌రు తీసుకునే నిర్ణ‌యం - ప్ర‌క‌టించే ప‌థ‌కాల విష‌యంలో మ‌రొక‌రితో పోలిక పెట్ట‌డం స‌హ‌జంగా మారింది. అయితే ఇద్ద‌రూ ఒకే ర‌క‌మైన ప‌నిచేస్తే...అది చ‌ర్చ‌నీయాంశం అవ‌డంలో వింతేముంది? ఇప్పుడు తాజాగా అదే జ‌రిగింది. తెలుగు రాష్ర్టాల సీఎంలు ఇద్ద‌రు త‌మ రాష్ట్ర రాజ‌ధానిలో లేరు. ఇద్దరు సీఎం ప్రస్తుతం ఔట్ ఆఫ్ స్టేషన్‌ లో ఉన్నారు. ఒక‌రు రాష్ర్టానికి దూరంగా ఉంటే ఇంకొక‌రు ఏకంగా దేశానికే దూరంగా ఉన్నారు.

కంటి ఆపరేషన్ నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన అక్కడే మరో రెండు రోజుల పాటు ఉండి ఈ నెల 10న తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్లారు. మరో వారం రోజుల పాటు అక్కడే ఉండి ఈ నెల 13న తిరిగి రానున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకేసారి స్థానికంగా లేకుండా పర్యటనకు వెళ్లిన సందర్భం ఇదే తొలిసారి అని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇద్దరు సీఎంలు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ ప్రగతి భవన్, అక్కడ అమరావతి రెండూ బోసిపోయాయని అంటున్నారు. ముఖ్యమంత్రులు ఇద్దరు స్థానికంగా లేకపోవడంతో మంత్రులు కూడా సచివాలయం వైపు వైపు రాకుండా శీతకన్ను వేశారు. ముఖ్యమంత్రులు స్థానికంగా లేకపోవడం, మంత్రులు సచివాలయానికి రాకపోవడంతో ఇరు రాష్ట్రాల్లో అధికారిక కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయని చెప్పవచ్చు. ఏదేమైనా ఇద్ద‌రు సీఎంలు ఒకేసారి ఔటాఫ్ స్టేషన్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News