• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తన స్ధాయిని తానే...

తన స్ధాయిని తానే తగ్గించేసుకుంటున్న చంద్రబాబు

By - Tupaki Desk
Update: 2020-12-20 05:15 GMT
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని అని చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడు తన స్ధాయిని తానే తగ్గించేసుకుంటున్నారు. చాలా చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా స్పందిచేస్తుండటంతోనే అందరికీ పలుచనైపోతున్నారు. ప్రతిరోజు మీడియాలో కనబడాలన్న తాపత్రయమే చంద్రబాబుకు చెడ్డపేరు తచ్చేస్తోంది. వైజాగ్ లో ఓ పోలీసు-వైసీపీ కార్యకర్త మద్య జరిగిన విషయమే ఇందుకు తాజా నిదర్శనం.

వైజాగ్ టీడీపీ ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణ ఆఫీసు దగ్గర ఓ పోలీసుపై వైసీపీ కార్యకర్త దౌర్జన్యం చేశాడంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పెద్ద ఆరోపణ చేసేశారు. తన ఆరోపణకు ఆధారంగా ఓ ఫొటోను కూడా ట్యాగ్ చేశారు. ఇంకేముంది తమ అధినేతే ఆరోపణలు చేసేపుడు తామెందుకు చేయకూడదని అదే ఫొటోను నారా లోకేష్ తో పాటు పార్టీ నేతలంతా ట్విట్టర్లో పెట్టేసి ఒకటే గోల చేస్తున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే వెలగపూడి ఆఫీసు దగ్గరున్న పోలీసును అటువైపు వచ్చిన ఓ ఆటో ఢీ కొట్టేసింది. దాంతో పోలీసు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో అటువైపు వచ్చిన వైసీపీ కార్యకర్త ఆ విషయం చూసి వెంటనే కిందపడిన పోలీసును పైకి లేపారు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఎవరో వీడియో, ఫొటోలు తీశారు. తీసిన ఫొటో, వీడియోలను టీడీపీకి పంపారు. దాంతో అసలే ప్రభుత్వంపై రెచ్చిపోవటానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు కదా. అందుకనే వీడియో, ఫొటో చూడగానే చంద్రబాబు రెచ్చిపోయారు.

చంద్రబాబు ట్విట్టర్లో వచ్చిన కామెంట్లు చూసిన పోలీసు శాఖ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే జరిగిన ఘటనను సదరు పోలీసు తన సహచరులకు చెప్పటంతో అసలు విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో చంద్రబాబు ట్విట్టర్లో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా రావటంతో అందరు ఆశ్చర్యపోయారు. ఆటో కారణంగా దెబ్బతిన్న పోలీసే తర్వాత మీడియాకు జరిగిందేమిటో చెప్పినా చంద్రబాబు+నారాలోకేష్+టీడీపీ నేతలు మాత్రం ఒప్పుకోవటం లేదు.

ఆమధ్య గుంటూరు జిల్లాలో పోలీసులు పేకాటాడుకుంటున్నారంటూ చంద్రబాబు ఓ ట్విట్ పెట్టి కామెంట్ చేశారు. తర్వాత అసలు విషయం బయటపడింది. ఇంతకీ ఆ ఫొటో మన రాష్ట్రంలోది కాదు. ఒడిస్సాలో ఎక్కడో పోలీసులు పేకాటాడుకుంటున్నారు. అక్కడెక్కడి ఫోటోను తెచ్చి గుంటూరులోదని చంద్రబాబుకు చెప్పేస్తే వెంటే వెనకాముందు చూసుకోకుండా వెంటనే ట్విట్టర్లో పెట్టేసి నవ్వులపాలయ్యారు. అసలు ఇటువంటి విషయాలపై చంద్రబాబు స్ధాయి వ్యక్తి స్పందించటం అవసరమా ? అని టీడీపీలోనే మాట్లాడుకుంటున్నారు.
Tags:    
  • Chandra Babu Naidu 
  • TDP 
  • Political News 
  • Breaking News 
  • Tupaki News Tupaki Updates 
  • Tupaki 
  • Latest News 
  • Tupaki Media 

Similar News

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS