ఇంత ఆలస్యంగా రియాక్టు కావటమా బాబు?
ఏదైనా జరిగిన వెంటనే రియాక్టు అయ్యే గుణం ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబులో ఎక్కువే. అందునా రాజకీయ అంశాల మీద ఆయన చాలా త్వరితగతిన స్పందిస్తుంటారు. గడిచిన మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారటమే కాదు.. కొత్త చర్చకు తెర తీసేలా ఉంది వంగవీటి రాధా ఎపిసోడ్. తన తండ్రి వర్ధంతి సందర్భంగా కొడాలి నాని.. వల్లభనేని వంశీలు కలవటం.. వారితో భేటీ కావటం ఒక ఎత్తు అయితే.. ఆ సందర్భంలో తన హత్యకు రెక్కీ జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వంగవీటి రాధా.
దీంతో.. ఆయన భద్రత మీద ఆందోళన వ్యక్తమైంది. ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అదుపులోకి తీసుకోవటం.. విచారించటం లాంటివి చాలా వేగంగా జరిగాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వంగవీటి రాధాకు భద్రతను రెట్టింపు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు అదనపు భద్రత కల్పిస్తూ నిర్నయం తీసుకున్నారు.
దీంతో.. అందరిలోనూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తమైంది. అసలేం జరుగుతోందన్న ఆరా మొదలైంది. తమ వారికి రక్షణ లేదని.. ముప్పు పొంచి ఉందని టీడీపీ నేతలు కోరినా స్పందించని జగన్ సర్కారు.. అందుకు భిన్నంగా వంగవీటి రాధా విషయంలో రియాక్టు అయిన తీరు కొత్త చర్చకు తెర తీసింది. ఇదిలా ఉంటే.. తనకు కల్పించిన భద్రతను తిరస్కరిస్తూ వంగవీటి రాధానిర్ణయం తీసుకున్నారు.
ఇదంతా జరుగుతున్నప్పుడు అధినేత హోదాలో ఉన్న చంద్రబాబు వెంటనే రియాక్టు కావటం.. పార్టీ నేత వంగవీటిని లైన్లోకి తీసుకొని.. అసలేం జరుగుతుందన్న ఆరా తీయాల్సి ఉంది. కానీ.. అలాంటిదేమీ చేయలేదు. తాజాగా మాత్రం వంగవీటి రాధాకు ఫోన్ చేసిన చంద్రబాబు.. రెక్కీ అంశాన్ని ప్రస్తావించి.. పలు అంశాల మీద ఆరా తీసినట్లుగా చెబుతున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్లను తిరస్కరించటం సరికాదని.. వ్యక్తిగత భద్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు చేశారు. సెక్యురిటీ విషయంలో అశ్రద్ధ తగదన్న ఆయన.. వంగవీటి రాధాకు పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కుట్ర రాజకీయాలపై పార్టీ పరంగా పోరాడదామని చెప్పిన చంద్రబాబు.. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. తన హత్యకు రెక్కీ జరిగిందని వంగవీటి రాధా వెల్లడించిన రెండురోజులకే ఏపీ ప్రభుత్వం రియాక్టు అయితే.. పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఆలస్యంగా స్పందించటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎప్పుడూ సూపర్ స్పీడ్ లో ఉండే చంద్రబాబు.. వంగవీటి ఎపిసోడ్ లో ఎందుకు వెనుకబడినట్లు చెప్మా?