కరోనా పై యుద్ధం ...100 కోట్ల విరాళం ఇచ్చిన అనిల్!

Update: 2020-03-23 08:00 GMT
కరోనా వైరస్ ... ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 14,650 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 3,37,533కి చేరింది.  కాగా, కరోనా భారత్ లో కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్  కేసుల సంఖ్య 415కు చేరినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్  తాజాగా ప్రకటించింది. అలాగే కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు 7 మంది చనిపోయారు. దేశంలో కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న సమయంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలని లాక్ డౌన్ చేయాలనీ ఆదేశాలు జారీచేసింది.

అయితే కరోనాను ఎదుర్కొనేందుకు ఒక పెద్దాయన భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అని తెలిపారు. ఆయన మరెవరో కాదు. వేదాంత రిసోర్సెస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనిల్ అగర్వాల్. కరోనా తో ప్రపంచం ప్రమాదపు అంచుల్లో  ఉన్న దశలో కరోనాతో పోరాడడానికి రూ.100 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.  పోరాడడానికి రూ.100 కోట్ల భారీ విరాళాన్ని వేదాంత గ్రూప్స్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ప్రకటించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. దేశంలో అత్యవసరం అయినపుడు ఈ నిధి ఉపయోగపడుతుంది. రోజూవారీ కూలీలకు, ఇబ్బందులు ఎదుర్కొనే వారికి తన వంతుగా ఈ సాయాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Read more!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వందకోట్లు ప్రకటిస్తున్నాను.  దేశ్ కీ జరూరతోన్ కే లియే అనే వాగ్దానం చేస్తున్నా. మన దేశానికి ప్రస్తుతం ఇదే కావాలి. కరోనా వైరస్ కారణంగా  చాలా మంది ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీల విషయంలో నేను చాలా ఆందోళనతో ఉన్నాను. నాకు తోచినంత వారికి సాయం అందిస్తాను అని అనిల్ కపూర్  తెలిపారు. అయితే , దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ నేపథ్యంలో అనిల్ కపూర్ స్పందించిన తీరుకు,  అయన ఉదాత్త హృదయానికి నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News