కేంద్రం సంచలన నిర్ణయం.. ఇక చైనామీద ఆధారపడాల్సిన అవసరం లేదు..!
మొబైల్ తయారీ కోసం మనదేశం చైనా మీద ఆధారపడాల్సి వస్తోంది. మన దేశంలో ‘చిప్ ఫాబ్రికేషన్ యూనిట్లు’ అధికంగా లేకపోవడంతో మొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో చైనా నుంచి కొన్ని వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అయితే గత ఏడాది .. చైనాతో మనదేశానికి ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. లడఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్నది. దాదాపు 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో పలు చైనా యాప్‌లను మనదేశం నిషేధించింది. దీంతో ఆ దేశానికి తీవ్ర ఆర్థికనష్టం వచ్చింది.
ఇదిలా ఉంటే ఇప్పటికే మొబైల్ తయారీ, ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాల తయారీ కోసం మనదేశం చైనా మీదే ఆధారపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకున్నది.
మనదేశంలోనే సెమీ కండక్టర్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వాలని చూస్తున్నది. ఇందుకోసం ఓ భారీ ఆఫర్ ను ప్రకటించింది.
'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా "చిప్ ఫాబ్రికేషన్ యూనిట్ల కోసం కేంద్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహం అందించబోతున్నది. మనదేశంలో ఏర్పాటు చేసే "చిప్ ఫాబ్రికేషన్ యూనిట్ల కోసం 1 బిలియన్ డాలర్ల ( సుమారు 7వేల కోట్ల రూపాయలు) నగదు ప్రోత్సాహం ఇవ్వబోతున్నారట. ఈ మేరకు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి మీడియాకు తెలిపారు.
అంతేకాక ఈ కంపెనీలు తయారుచేయబోయే చిప్ లను కూడా కేంద్రమే కొనుగోలు చేయాలని భావిస్తున్నదట. ప్రస్తుతం మనదేశంలో చిప్‌ల కొరత ఉంది. దీంతో చిప్ లను చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మనదేశంలోనే చిప్ లు తయారు చేయాలని కేంద్రం యోచిస్తున్నది. ఇందుకోసం ప్రోత్సాహం అందించాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది.