లాక్ డౌన్ సడలింపు : తెరిచే షాపులేవీ - క్లోజ్ లో ఉండేవి ఏవీ?
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం మార్చి 24న తొలిసారి లాక్ డౌన్ ప్రకటించింది. తొలిదశ లాక్ డౌన్ గడువు .. ఏప్రిల్ 14న ముగిసింది. అయితే, అప్పటికి కరోనా కంట్రోల్ లోకి రాకపోవడంతో ... మే 3 వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తూ ప్రకటించింది. ఇప్పటి వరకు మెడికల్ షాపులు పూర్తిగా, కిరాణా షాపులు పరిమితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే శుక్రవారం అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది.
రద్దీ దృష్ట్యా మున్సిపాలిటీ పరిధి ముగిసిన తర్వాత గల నివాస సముదాయాల్లో ఉన్న వ్యాపార, వాణిజ్య సముదాయలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. మున్సిపాలిటీలో గల మల్టీ బ్రాండ్, సింగిల్ బ్రాండ్ మాల్స్ తెరవబోమని స్పష్టంచేసింది. కరోనా వైరస్ హాట్ స్పాట్ - కంటైన్ మెంట్ జోన్లలో పరిస్థితి యథతథాంగా కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. ఏప్రిల్ 15వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులకు కేంద్ర హోంశాఖ సవరణలు చేసింది. ఆయా వ్యాపార సముదాయాల్లో 50 శాతం సిబ్బంది మాత్రమే పనిచేయాలని షరతు విధించింది. దీంతోపాటు వారు మాస్క్ వేసుకొని - సామాజిక దూరం పాటించాలని స్పష్టంచేసింది.మద్యం షాపులు కూడా తెరవబోమని స్పష్టంచేసింది.
షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవొచ్చని తెలిపింది. అయితే , ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు - కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలకుల అనుమతి తప్పనిసరి. తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకూ సంపూర్ణ లాక్ డౌన్ విధించింది కాబట్టి... తెలంగాణలో కేంద్రం రూల్ వర్తించదు. అదే ఏపీలో కేంద్ర వెసులు బాట్లు అమల్లో ఉన్నాయి కాబట్టి ఏపీలో అన్ని షాపులూ తెరచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేంద్ర చెప్పిన కండీషన్ల ప్రకారం షాపులు తెరచుకోవచ్చు. ఇండియాలో ఇప్పుడిప్పుడే కరోనా జోరందుకుంటోంది. మొత్తం కేసుల సంఖ్య 24,530కి చేరింది. వీరిలో 5,498 మంది మాత్రం పూర్తిగా రికవరీ అయ్యారు. అలాగే , మొత్తం మరణాల సంఖ్య 775కి చేరింది.