పాకిస్థాన్ దగ్గర 30 కోట్ల రూపాయలు కూడా లేవా?.. ప్రభావం కోసం పాకులాడితే.. పరువుపోయింది!
పాకిస్థాన్ దగ్గర 30 కోట్ల రూపాయలు కూడా లేవా?.. ఇదీ ఇప్పుడు అన్ని వైపుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న.;
పాకిస్థాన్ దగ్గర 30 కోట్ల రూపాయలు కూడా లేవా?.. ఇదీ ఇప్పుడు అన్ని వైపుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. దీనికి కారణం.. ఇటీవల ఇరాన్-అమెరికా దేశాలకు చెందిన ప్రతినిధి బృందంతో పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరించి యుద్ధంపై చర్చలు చేపట్టింది. దీనికిగాను ఇస్లామాబాద్‌లోని సెరేనా హోటల్స్‌లో గదులను రెండు రోజుల పాటు అద్దెకు తీసుకుంది. అటు ఇరాన్.. ఇటు అమెరికా నుంచి 32 మంది ప్రతినిధులు వచ్చారు.
వారి వారి స్థాయికి తగిన విధంగా పాకిస్థాన్ ఏర్పాట్లు చేసింది. ఈ హోటల్‌లో ఒక రాత్రి బస చేసేందుకు స్టాండర్డ్ రూమ్ ఖరీదు 15000 రూపాయలు, అదే ప్రెసిడెన్షియల్ సూట్ అయితే... 2,21000 రూపాయలు. ఇలాంటివి ఓ పది పదిహేను రూములను పాకిస్థాన్ బుక్ చేసింది. మొత్తానికి రెండు రాత్రుళ్లు ఇదే హోటల్‌లో చర్చలు జరిగాయి. కానీ,చర్చలు ఫలించలేదు. ఇరు దేశాలు కూడా తమ బింకాన్ని వదిలి పెట్టలేదు. దీంతో చర్చలు అర్ధంతరంగా ముగిసి ఎవరి దేశాలకు వారు వెళ్లిపోయారు.
కాగా.. ఈ చర్చలకు మద్యవర్తిత్వం వహించిన పాకిస్థానే సెరేనాహోటల్ బిల్లును చెల్లించాలి. కానీ.. దీనిని చెల్లించేందుకు పాక్ దగ్గర కాసులు లేవని తెలిసింది. ఇక, బిల్లు విషయానికి వస్తే.. 10 స్టాండర్డ్ రూమ్‌లు.. ఇతరవన్నీ.. ప్రెసిడెన్షియల్ సూట్లు తీసుకున్నారు. ఇక, బ్యాంకెట్ హాల్, భోజనాలు, కాఫీలు, ఇతరత్రావంటి వన్నీ కలుపుకొని తక్కువలో తక్కువగా 32 కోట్ల రూపాయల మేరకు బిల్లు పడింది. ఈ బిల్లు ఇప్పటి వరకు చెల్లించలేదని హోటల్ యజమాని, ప్రభుత్వ పనుల కాంట్రాక్టర్ సెరేనా పేర్కొన్నట్టు పాక్‌జాతీయ మీడియా తెలిపింది.
ఆర్భాటానికి పోయి..
వాస్తవానికి అఫ్ఘానిస్తాన్‌తో యుద్ధం చేస్తున్న పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా ఉంది. దీనికితోడు అంతర్గత పోరుతో పాటు పశ్చిమా సియా సంక్షోభం కూడా నెత్తిన పడింది. దీంతో పాకిస్థాన్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వం ఒప్పుకుని.. ప్రపంచ దేశాల ముందు.. తామే ఈ యుద్ధాన్ని ఆపామన్న ఆర్భాటానికి దిగడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు 32 కోట్ల రూపాయల మేరకు కూడా బిల్లు చెల్లించలేని దుస్థితిలో ఉండడంపై మరిన్ని విమర్శలు వస్తున్నాయి.